పీకేకి దీదీ ‘గాలం’.. రాజ్యసభకు టీఎంసీ టికెట్ ఖాయం..!

రాజకీయ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఇప్పటినుంచే తమ గుప్పిట్లో ఉంచుకోవాలని భావిస్తున్నట్టు కనిపిస్తోంది.

పీకేకి దీదీ 'గాలం'.. రాజ్యసభకు టీఎంసీ టికెట్ ఖాయం..!
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Mar 01, 2020 | 11:48 AM

రాజకీయ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఇప్పటినుంచే తమ గుప్పిట్లో ఉంచుకోవాలని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. (వచ్ఛే ఏడాది మే నెలలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి). జేడీ-యు నుంచి బహిష్కృతుడైన పీకేకి త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తమ టీఎంసీ తరఫున ఎగువసభకు టికెట్ ఇచ్ఛే యోచనలో దీదీ ఉన్నట్టు సమాచారం. రాజ్యసభకు చురుకైన యువ అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్న ఈ పార్టీ.. ఈ యువ నేతను సెలెక్ట్ చేసే సన్నాహాల్లో ఉంది. ప్రస్తుత రాజ్యసభ సభ్యులైన మనీష్ గుప్తా, జోగేన్ చౌదరి, అహ్మద్ హాసన్ ఇమ్రాన్, కె.డి.సింగ్ పదవీకాలం త్వరలో ముగియనుంది. ఎగువసభలో బీజేపీని ఎదుర్కోవాలంటే ప్రశాంత్ కిషోర్ వంటి నేత ఉండాల్సిందే అని దీదీ కూడా భావిస్తున్నారు. ఇందువల్ల జాతీయ స్థాయిలో టీఎంసీకి మంచి గుర్తింపు వస్తుందని కూడా  పార్టీ ఆశిస్తోంది. ఇక దినేష్ త్రివేదీ, మౌసమ్ నూర్ అనే యువ నేతలకు కూడా టికెట్లు లభించనున్నాయి.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి చూస్తే.. ఎగువ సభకు టీఎంసీ నాలుగు సీట్లను గెలుచుకోనుంది. ఒక అభ్త్యర్ధి సీపీఎం, కాంగ్రెస్ లేదా టీఎంసీ కంబైన్ మద్దతుతో ఐదో సీటును గెలుచుకోగలుగుతారు. ఈ ఐదో సీటు రీటా బ్రత బెనర్జీది. 2014  లో ఆమె.. సీపీఎం నామినీగా ఎన్నికయ్యారు. అయితే 2017 లో ఆ పార్టీ నుంచి బహిష్కృతులయ్యారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu