
సీతమ్మను పెళ్లాడేందుకు రాముడు విరిచిన శివధనస్సు గురించి తెలిసే ఉంటుంది. రాముడు కాబట్టి దాన్ని ఎత్తి, విరవగలిగాడు. కానీ, చాలా మంది దాన్ని ఒక్క ఇంచుకూడా ఎత్తలేకపోయారు. చివరికి రావణ బ్రహ్మ కూడా దాన్ని కనీసం ఎత్తలేకపోయాడు. ఎందుకంటే.. ఆ శివుడి విల్లు అంత పవర్‌ఫుల్. అయితే ఆ విల్లుకు మరో పేరుంది పినాకా. ఆ పేరు మీద స్వదేశీ పరిజ్ఞానంతో మల్లీ బారెల్ రాకెట్ లాంచర్‌ను డీఆర్‌డీఓ అభివృద్ధి చేసింది. దాన్ని గతంలోనే ఇండియన్ ఆర్మీకి అందించింది. ప్రస్తుతం పాకిస్థాన్‌తో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో భారత అమ్ముల పొదిలో ఉన్న ఈ శివుడి ఆయుధం గురించి భయంకరమైన నిజాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.
స్వదేశీ పినాకా మల్టీ-బారెల్ రాకెట్ లాంచర్ (MBRL) వ్యవస్థ దేశ రక్షణలో శక్తివంతమైన ఆయుధంగా ఉంది. దీన్ని DRDO రూపొందించి, అభివృద్ధి చేసింది. పినాకా ఫైర్‌పవర్, కచ్చితత్వం, స్కేలబిలిటీ దీని ప్రత్యేకత. నిరోధం, నిర్ణయాత్మక సైనిక కార్యకలాపాలకు అవసరమైన లక్షణాలు కలిగి ఉంది. శివుని దివ్య విల్లు అయిన పినాకం పేరు మీద ప్రవేశ పెట్టిన ఈ వ్యవస్థ భారతదేశ సంప్రదాయాన్ని, సమకాలీన రక్షణ సామర్థ్యాలను ప్రతీకగా నిలుస్తుంది. దీన్ని ఎక్కుపెడితే సంపూర్ణ శక్తితో చెడును నిర్మూలించడానికి దైవిక ఆయుధాన్ని ప్రయోగించినట్లే. నేటి పినాక రాకెట్ లాంచర్ యుద్ధభూమిలో ఒక విధ్వంసం.
పినాకా కేవలం 44 సెకన్లలో 72 రాకెట్లను ప్రయోగించగలదు. 60 కి.మీ దూరంలో ఉన్న శత్రు స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ఏడు టన్నుల వరకు పేలుడు పదార్థాలను పంపిస్తాయి. అడ్వాన్స్‌డ్ వేరియంట్ పినాకా Mk-II ER 90 కి.మీ వరకు దూరాలను ఛేదిస్తుంది. ఇంటిగ్రేటెడ్ GPS, ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్‌లు కచ్చితమైన లక్ష్యాన్ని నిర్ధారిస్తాయి. ఇండియా అనుకున్న సమయానికి, అనుకున్న ప్రదేశంలో అధిక మందుగుండు సామగ్రితో స్పందించడానికి ఈ పినాకా వ్యవస్థ రెడీగా ఉంటాయి.
ఆత్మనిర్భర్ భారత్ చొరవతో ఈ పినాకాను మరింత అభివృద్ధి చేశారు. ఏటా 5,000 కంటే ఎక్కువ రాకెట్లను ఉత్పత్తి చేస్తున్నారు. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, లార్సెన్ అండ్ టూబ్రో వంటి భారతీయ రక్షణ తయారీదారులు వీటి ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిని అర్మేనియా దేశానికి కూడా భారత్ ఎగుమతి చేసింది. ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానానికి సమతూగేలా రూపొందించబడిన పినాకా.. నెట్‌వర్క్-కేంద్రీకృత కార్యకలాపాలు, అత్యాధునిక కమాండ్, నియంత్రణ వ్యవస్థలతో అనుసంధానించబడి ఉంది. ఇది ఇప్పటికే ఉన్న ఫిరంగి, డ్రోన్ వ్యవస్థలను భర్తీ చేస్తోంది. దీంతో ఇండియన్ ఫైర్‌పవర్ ను పెంచుతుంది. ఇది కేవలం రాకెట్ లాంచర్ మాత్రమే కాదు.. అంతకంటే ఎక్కువ.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి