అమ్మవారి ఆలయానికి వెళ్లి వస్తుండగా..! యాత్రికుల బస్సు బోల్తా.. తొమ్మిది మందికి గాయాలు

స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

అమ్మవారి ఆలయానికి వెళ్లి వస్తుండగా..! యాత్రికుల బస్సు బోల్తా.. తొమ్మిది మందికి గాయాలు
9 Passengers Injured

Updated on: Nov 23, 2024 | 2:30 PM

జమ్మూలో రోడ్డు ప్రమాదం సంభవించింది. శనివారం నాడు జమ్మూ కాశ్మీర్‌లోని కత్రాలో యాత్రికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడడంతో తొమ్మిది మంది గాయపడ్డారు. శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయం నుంచి యాత్రికులతో కత్రా నుంచి జమ్మూ వెళ్తున్న బస్సు..కత్రాలోని దోమైల్ సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో తొమ్మిది మందికి తీవ్రగాయాలయ్యాయి.

స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.