PIB Fact check: చైనా సహా పలు దేశాల్లో కరోనావైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటంతో అంతర్జాతీయంగా కరోనా ఫోర్త్ వేవ్ అలజడి నెలకొంది. ఈ తరుణంలో భారత ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. పొరుగు దేశాల్లో కోవిడ్-19 వేరియంట్ BF.7 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్రాలకు సూచనలు చేసింది. దీంతోపాటు విదేశాల నుంచి వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. ఒకవేళ కేసుల సంఖ్య పెరిగితే తీసుకోవాల్సిన చర్యలు.. సన్నాహాలపై ఇప్పటికే కేంద్రంలోని మోడీ సర్కార్ వరుస సమీక్షలు నిర్వహిస్తూ వస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో మంగళవారం దేశవ్యాప్తంగా కరోనా మాక్ డ్రిల్ కూడా నిర్వహించింది. వైద్యసిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేయడంతోపాటు.. పలు మార్గదర్శకాలను కూడా విడుదలచేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో దేశంలో లాక్‌డౌన్ విధిస్తున్నారన్న ఫేక్ సమాచారం వైరల్ అవుతుండటం అందరిలో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా.. ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కరోనా ఫోర్త్ వేవ్ భయం మధ్య దేశంలో 7 రోజుల పాటు లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఇంటర్నెట్‌లో విస్తృతంగా వైరల్ అవుతోంది. యూట్యూబ్ ఛానెల్ CE News కు సంబంధించిన స్క్రీన్‌షాట్ ప్రకారం.. డిసెంబర్ 24 నుంచి భారతదేశంలో లాక్‌డౌన్ అమలవుతుందని ఉంది. ఒక వారం పాటు లాక్‌డౌన్ ఉంటుందన్న సందేశం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన అత్యవసర సమావేశంలో లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించినట్లు దానిలో పేర్కొంది.
అయితే, పోస్ట్ వైరల్ కావడంతో ప్రభుత్వానికి సంబంధించిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) అసలు వాస్తవాన్ని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ నకిలీదని వెల్లడించింది.
వాస్తవం: ఈ ప్రకటన తప్పు.. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఈ మేరకు PIB ఒక ట్వీట్ చేసింది. ఈ వీడియోలోని సమాచారం నకిలీది.. భారత ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోలేదు అంటూ పేర్కొంది.
‘CE News’ नामक एक #YouTube चैनल के वीडियो में यह दावा किया जा रहा है कि आज रात 12 बजे से 7 दिन तक भारत बंद रखने का फैसला लिया गया है#PIBFactCheck
▶️ इस वीडियो में किया गया दावा फ़र्ज़ी है
▶️ भारत सरकार ने ऐसा कोई फैसला नहीं लिया है pic.twitter.com/eX3QXdkOxn
— PIB Fact Check (@PIBFactCheck) December 24, 2022
భారతదేశంలో ప్రస్తుత కోవిడ్ పరిస్థితి ప్రకారం.. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. లాక్‌డౌన్, అంతర్జాతీయ విమానాల సస్పెన్షన్ లాంటి నిర్ణయాలు తీసుకోలేదు. అయితే కొన్ని దేశాల్లో కేసుల పెరుగుదల కారణంగా నిఘా, అప్రమత్తత పెంచాల్సిన అవసరం ఉందని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.