ఒలంపిక్స్ లో జావెలిన్ త్రో లో మెరిసి గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా పేరు ఇప్పుడు దేశమంతా మారుమోగిపోతోంది. ఆయన గౌరవార్థం గుజరాత్ లోని భరూచ్ జిల్లాలో ఓ పెట్రోలు బంక్ యజమాని ‘నీరజ్’ పేరున్న ఎవరైనా తన పెట్రోల్ బంక్ లో ఉచితంగా పెట్రోలు పోయించుకోవచ్చునని ప్రకటించాడు. ఆయూబ్ పఠాన్ అనే ఈ మేనేజర్ ..నీరజ్ పేరున్న వ్యక్తులు 501 రూపాయల విలువ చేసే పెట్రోలును ఉచితంగా పొందవచ్చునని అన్నాడు. అయితే ఈ ఆఫర్ కేవలం రెండు రోజులు మాత్రమే.. ఈ పేరున్న వారు తమ ఆధార్ లేదా ఐడెంటిటీ కార్డును చూపాల్సి ఉంటుందన్నాడు. ఈ రెండు రోజుల్లో ఈ పేరు గల కస్టమర్స్.. 28 మంది ఇతని బంక్ లో ఫ్రీగా ఇంధనం పోయించుకున్నారు. రెండు రోజుల్లో 15 వేల రూపాయల విలువైన 150 లీటర్ల పెట్రోలును ఈ మేనేజర్ ఫ్రీగా ఇచ్చేశాడు.
నీరజ్ చోప్రా మీది అభిమానంతో.. ఆ యన గౌరవార్థం ఈ స్కీం అమలు చేశామని, ఇలా ఆయన పట్ల మా ఇష్టాన్ని చూపామని ఆయూబ్ పఠాన్ చెప్పారు. గత సోమవారం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న నీరజ్ చోప్రాకు అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున ఘన స్వాగతం పలికారు. ఆయనకు, ఒలంపిక్ టీమ్ కి పుష్ప గుచ్చాలు సమర్పించి తమ అభిమానాన్ని చాటుకున్నావారు. ఇండిగో ఎయిర్ లైన్స్.. ఈ ఏడాది కాలానికి గాను దేశంలో ఎక్కడైనా ఆయన ఉచితంగా తమ విమానాల్లో ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ‘బల్లెం వీరుడి’గా ఆయన పాపులర్ అయిపోయాడు.
మరిన్ని ఇక్కడ చూడండి : ప్రాణాలకు తెగించి బావిలో పడ్డ పిల్లిని రక్షించిన యువతి..మహిళా సాహసంకు నెటిజన్లు ఫిదా..!:Woman Savs Cat Video.
నోరుజారిన లాస్య.. రవి ఆ హౌజ్‌లోకి అంటూ.. సైలెంట్ సెటైర్..(వీడియో): Anchor Ravi In BiggBoss5.