Petrol Price Today : సామాన్యులకు ఉపశమనం.. స్థిరంగా పెట్రోల్ డీజిల్ ధరలు.. ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల వరకు ధరలు ఇలా ఉన్నాయి.

| Edited By: Ravi Kiran

Mar 22, 2021 | 1:19 PM

పెరగడమే తప్ప తగ్గడం అంటూ లేకుండా దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు దూసుకెళుతున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా మాత్రం సామాన్యుడికి కాస్త ఉపశమనం లభించే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Petrol Price Today : సామాన్యులకు ఉపశమనం.. స్థిరంగా పెట్రోల్ డీజిల్ ధరలు.. ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల వరకు ధరలు ఇలా ఉన్నాయి.
Petrol Diesel Prcie
Follow us on

Petrol Price Today : దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరలు సాధారణ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పెరగడమే తప్ప తగ్గడం అంటూ లేకుండా దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు దూసుకెళుతున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా మాత్రం సామాన్యుడికి కాస్త ఉపశమనం లభించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇంధన ధరల్లో తగ్గుదల కనిపించకపోయినప్పటికీ పెరుగుదలకు మాత్రం బ్రేక్‌ పడుతున్నాయి. ప్రస్తుతం పెట్రోల్తా డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.  దేశవ్యాప్తంగా శనివారం పెట్రోల్‌, డీజీల్‌ ధరలు ఎలా ఉన్నయో ఇప్పుడు చూద్దాం.

ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.17 ఉండగా (శుక్రవారం రూ. 91.17), డీజిల్‌ ధర రూ.81.47 వద్ద (శుక్రవారం రూ.81.47 ) కొనసాగుతోంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.57 గా ఉండగా (శుక్రవారం రూ. 97.57 ), డీజిల్‌ రూ.88.60 (శుక్రవారం రూ.88.60 ) గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో శుక్రవారంతో పోలిస్తే ఈరోజు పెట్రోల్‌ డీజిల్‌ ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేవు. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 94.79 (శుక్రవారం రూ. 94.79 ) ఉండగా, డీజిల్‌ ధర రూ. 88.86 (శుక్రవారం రూ. 88.86 )గా నమోదైంది. ఇక తెలంగాణలో మరో ముఖ్య పట్టణం వరంగల్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 94.37 (శుక్రవారం రూ. 94.37 ), డీజిల్‌ రూ. 88.45 (శుక్రవారం రూ. 88.45 )గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే.. విజయవాడలో  లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 97.00 (శుక్రవారం రూ.97.00 ), డీజిల్‌ ధర రూ. 90.82 (శుక్రవారం రూ.90.91) వద్ద కొనసాగుతోంది. సాగర తీరం విశాఖపట్నంలో  లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.55 (శుక్రవారంరూ. 93.55 )గా ఉండగా, లీటర్‌ డీజిల్‌ రూ. 90.35 (సోమవారం రూ.89.92 )గా వద్ద కొనసాగుతోంది.

తమిళనాడు రాజధాని చెన్నైలో శనివారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.11 ఉండగా (శుక్రవారం రూ. 93.11 ), డీజిల్‌ ధర రూ. 86.58 (శుక్రవారం రూ. 86.45 ) వద్ద కొనసాగుతోంది. ఇక కర్నాటక రాజధాని బెంగళూరులో ఈరోజు లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.22 (శుక్రవారం రూ. 94.22 ), ఉండగా డీజిల్‌ ధర రూ.86.37 (శుక్రవారం రూ. 86.37 ) గా ఉంది.