Rashtrapati Bhavan: 11 నెలల తర్వాత తెరుచుకోనున్న రాష్ట్రపతి భవన్‌.. 6 నుంచి ప్రజలు సందర్శిచేందుకు అనుమతి

|

Feb 02, 2021 | 6:30 AM

Rashtrapati Bhavan: ఫిబ్రవరి 6 నుంచి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ తెరుచుకోనుంది. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది 13న మూసి వేసిన విషయం తెలిసిందే. దాదాపు...

Rashtrapati Bhavan: 11 నెలల తర్వాత తెరుచుకోనున్న రాష్ట్రపతి భవన్‌.. 6 నుంచి ప్రజలు సందర్శిచేందుకు అనుమతి
Follow us on

Rashtrapati Bhavan: ఫిబ్రవరి 6 నుంచి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ తెరుచుకోనుంది. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది 13న మూసి వేసిన విషయం తెలిసిందే. దాదాపు 11 నెలల తర్వాత ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ప్రజల సందర్శనార్థం రాష్ట్రపతి భవన్‌ తెరుచుకోనుంది. ఈ మేరకు పర్యాటకులకు ప్రవేశం కల్పించనున్నారు. అయితే శని, ఆదివారాలు మినహా ఇతర రోజుల్లో తెరిచే ఉంటుందని అధికారులు వెల్లడించారు. గతంలో మారిదిగానే ప్రవేశ రుసుం రూ.50 వసూలు చేస్తారని, టికెట్లను రాష్ట్రపతి భవన్‌ వెబ్‌సైట్‌ నుంచి కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. సందర్శనానికి వచ్చే వారు కోవిడ్‌ మార్గదర్శనాలను తప్పకుండా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు.

కాగా, కరోనా కారణంగా అన్ని రంగాలకు మూతపడ్డాయి. దీంతో రాష్ట్రపతి భవన్‌ కూడా మూసివేశారు అధికారులు. అయితే దేశంలో ప్రస్తుతం కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. దేశంలో అన్‌లాక్‌ ప్రక్రియ కొనసాగుతుంది. దీంతో అన్ని రంగాలు తెరుచుకుని తమ తమ కార్యాకలాపాలు నిర్వహిస్తున్నాయి. దాదాపు 11 నెలలుగా మూతపడిన రాష్ట్రపతి భవన్‌ ఎట్టకేలకు తెరుచుకోనుంది. ఇన్నేళ్లకు రాష్ట్రపతి భవన్‌ తెరుచుకోనుండటంతో అధికారులు శానిటైజ్‌ను చేయిస్తున్నారు. ప్రజలు సందర్శించే రోజుల్లో కూడా కరోనా నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రతి రోజుకూడా భవనాన్ని ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేయనున్నారు.

Also Read: Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరం నిర్మాణం… భారీ మొత్తంలో విరాళం ప్రకటించిన ముఖ్యమంత్రి..