Permanent Ban TikTok: టిక్‌టాక్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. యాప్‌పై శాశ్వత బ్యాన్ విధించే అవకాశం.!

|

Jan 26, 2021 | 12:50 PM

Permanent Ban TikTok:  టిక్‌టాక్‌తో సహా 59 చైనీస్ యాప్‌లపై శాశ్వతంగా బ్యాన్ విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది...

Permanent Ban TikTok: టిక్‌టాక్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. యాప్‌పై శాశ్వత బ్యాన్ విధించే అవకాశం.!
Follow us on

Permanent Ban TikTok:  టిక్‌టాక్‌తో సహా 59 చైనీస్ యాప్‌లపై శాశ్వతంగా బ్యాన్ విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ టిక్ టాక్‌తో సహా 58 చైనీస్ యాప్స్‌కు నోటిసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

2020 జూన్‌లో దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు, జాతీయ భద్రత, భారతీయుల గోప్యతకు భంగం కలిగిస్తున్నయంటూ ఈ యాప్స్‌పై మోదీ సర్కార్ తాత్కాలికంగా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో టిక్‌టాక్‌, విచాట్, యూసీ బ్రౌజర్ వంటి పలు కంపెనీలను పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని కేంద్రం కోరింది. అయితే ఆయా కంపెనీలు ఇచ్చిన స్పందన సంతృప్తిగా లేకపోవడంతో మరోసారి వివరణ ఇవ్వాలంటూ తాజాగా కేంద్రం నోటిసులు పంపింది. అటు 2020 సెప్టెంబర్‌లో కేంద్రం పబ్‌జీతో సహా 118 చైనీస్ యాప్‌లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.