జమ్ము కశ్మీర్ ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగంతో లద్దాఖ్ ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. మోదీ వారికి అన్ని రకాలుగా భరోసా ఇవ్వడంతో వారిలో ఉత్సాహం రెట్టింపయ్యింది. ఈ సందర్భంగా వారు టీవీ9తో మాట్లాడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
కేంద్ర పాలిత ప్రాంతంగా లద్దాఖ్‌ను ప్రకటించక ముందు తమలో ప్రజల్లో ఎన్నో సందేహాలున్నాయని కానీ ప్రధాని తమనుద్దేశించి మాట్లాడిన తర్వాత అన్ని భయాలు తొలగిపోయాయని ఆనందం వ్యక్తం చేశారు. తమ భవిష్యత్తుకు ప్రధాని ఎంతో భరోసా ఇచ్చారని లద్దాఖ్ యువత ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని తన ప్రసంగంలో అన్ని విషయాలు నివృత్తి చేయడంతో తమకు మరింత నమ్మకం కలిగిందన్నారు.
ఆయన చెప్పినట్టుగానే అన్నీ జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ యువతకు ఉద్యోగాల కల్పన, విద్యాహక్కు వంటివి అమలు చేస్తామని ప్రధాని హామీ ఇవ్వడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు లద్దాఖ్ ప్రజలు.