“బాయ్‌కాట్ మేడ్ ఇన్ చైనా‌” పేరుతో మాస్క్‌లు..

| Edited By:

Jun 21, 2020 | 1:06 PM

సోమవారం నాడు లదాఖ్‌లోని గాల్వన్‌ లోయలో చోటుచేసుకున్న ఘర్షణ గురతించి తెలిసిందే. భారత్‌-చైనా జవాన్ల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ చోటుచేసుకుంది.

బాయ్‌కాట్ మేడ్ ఇన్ చైనా‌ పేరుతో మాస్క్‌లు..
Follow us on

సోమవారం నాడు లదాఖ్‌లోని గాల్వన్‌ లోయలో చోటుచేసుకున్న ఘర్షణ గురతించి తెలిసిందే. భారత్‌-చైనా జవాన్ల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. మరో 30 మంది చైనా జవాన్లు మరణించారు. ఈ సంఘటన జరిగిన తర్వాత దేశ వ్యాప్తంగా చైనాపై తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లవెత్తుతున్నాయి. అనేక ప్రాంతాల్లో చైనా వస్తువులను, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు. అయితే జమ్ముకశ్మీర్‌లో మాస్క్‌లతో చైనాపై వ్యతిరేకతను చాటుతున్నారు. ప్రస్తుతం కరోనా కట్టడి నేపథ్యంలో మాస్క్‌లు తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. దీంతో మాస్క్‌లతో చైనాపై వారివారి వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌ ప్రాంతంలో ఓ దుకాణాదారుడు.. బై మేడ్‌ ఇన్ ఇండియా.. బాయ్‌కాట్‌ రెడ్‌ చైనా, బాయ్‌కాట్ మేడ్ ఇన్ చైనా స్లోగన్స్‌తో మాస్క్‌లను తయారు చేసి అమ్ముతున్నాడు. కస్టమర్లు వీటిపై ఎక్కువ మొగ్గు చూపుతున్నారని సదరు వ్యాపారస్థుడు తెలిపారు.