దేశ వ్యాప్తంగా చైనా అధ్యక్షుడి దిష్టి బొమ్మలు దహనం

| Edited By:

Jun 17, 2020 | 12:53 PM

డ్రాగన్‌ కంట్రీ కన్నింగ్ వేశాలకు 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది.

దేశ వ్యాప్తంగా చైనా అధ్యక్షుడి దిష్టి బొమ్మలు దహనం
Follow us on

డ్రాగన్‌ కంట్రీ కన్నింగ్ వేశాలకు 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. తొలుత కల్నల్‌ సహా.. మరో ఇద్దరు జవాన్లు మరణించారని అనుకున్నా.. ఆ తర్వాత మొత్తం 20 మంది వరకు భారత జవాన్లు మరణించారని జాతీయ న్యూస్ ఏజెన్సీస్ ప్రకటించాయి. ఈ క్రమంలో భారత ప్రజలు చైనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దిష్టిబొమ్మలను దహనం చేస్తూ.. నిరసనలు తెల్పుతున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మంగళవారం సాయంత్రం బాపునగర్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అంతేకాదు.. చైనీస్‌కు చెందిన వస్తువులను కూడా కాల్చేస్తూ.. చైనీస్ వస్తువులకు చెక్ పెట్టాలంటూ నినాదాలు చేశారు. మరోవైపు అటు వారణాసిలో కూడా విశాల్‌ భారత్‌ సంస్థాన్‌ సంస్థ ఆధ్వర్యంలో జిన్‌పింగ్‌ దిష్టిబొమ్మను కాల్చేశారు.

కాగా, సోమవారం జరిగిన ఘర్షణలో అటు చైనాకు చెందిన సైనికులు కూడా పెద్ద సంఖ్యలో మరణించారని సమాచారం. దాదాపు 43 మంది సైనికులు గాయపడి ఉంటారని వార్తలు వస్తుంటే.. అమెరికాకు చెందిన న్యూస్ ఏజెన్సీస్ మాత్రం.. 35 మంది చైనా సైనికులు చనిపోయారని ప్రకటించాయి.