Gyan Bharatam Mission: పతంజలి వర్సిటీ మరో ఘతన.. జ్ఞాన్ భారతం మిషన్ క్లస్టర్ సెంటర్‌గా గుర్తింపు

ప్రముఖ యోగా గురువు రాందేవ్‌ బాబాకు చెందిన పతంజలి విశ్వవిద్యాలయం మరో ఘనత సాధించింది. పతంజలి విశ్వవిద్యాలయాన్ని సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన జ్ఞాన్ భారతం మిషన్ క్లస్టర్ సెంటర్‌గా గుర్తించింది. ఈ చొరవకు గాను యోగా గురువు స్వామి రామ్‌దేవ్ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Gyan Bharatam Mission: పతంజలి వర్సిటీ మరో ఘతన.. జ్ఞాన్ భారతం మిషన్ క్లస్టర్ సెంటర్‌గా గుర్తింపు
Patanjali University

Updated on: Dec 15, 2025 | 3:52 PM

హరిద్వార్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పతంజలి విశ్వవిద్యాలయాన్ని సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు చెందిన జ్ఞాన్ భారతం మిషన్ క్లస్టర్ సెంటర్‌గా గుర్తించినట్టు మంత్రిత్వశాఖ పేర్కొంది. దీంతో పతంజలి విశ్వవిద్యాలయ ఛాన్సలర్ స్వామి రాందేవ్, వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆచార్య బాలకృష్ణ, జ్ఞాన్ భారతం మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు డాక్టర్ అనిర్వన్ దాష్, డాక్టర్ శ్రీధర్ బారిక్ , విశ్వరంజన్ మాలిక్ సమక్షంలో ఒప్పందంపై సంతకం చేశారు.

ప్రధానికి బాబా రాందేవ్‌ కృతజ్ఞతలు

ఈ పతాంజలి విశ్వవిద్యాలయం ఈ ఘనత సాధించిందేకు సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, సాంస్కృతిక మంత్రి గజేంద్ర షెకావత్, జ్ఞాన భారతం మిషన్ మొత్తం బృందానికి యోగా గురువు రాందేవ్‌ బాబా కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ జ్ఞాన సంప్రదాయాన్ని పరిరక్షించడానికి జ్ఞాన భారతం మిషన్ ఒక ఉదాహరణగా యోగా గురువు అభివర్ణించారు.

ఇప్పటివరకు కుదిరిన 33 అవగాహన ఒప్పందాలు

ఈ సందర్భంగా, డాక్టర్ ఆచార్య బాలకృష్ణ మాట్లాడుతూ, ఈ మిషన్ కింద ఇప్పటివరకు 33 ఎంఓయూలు కుదుర్చుకున్నామని తెలిపారు. పతంజలి విశ్వవిద్యాలయం యోగా విద్యకు అంకితమైన మొదటి క్లస్టర్ కేంద్రంగా. పతంజలి విశ్వవిద్యాలయం ఇప్పటివరకు 50,000 పురాతన గ్రంథాలను భద్రపరిచిందని, 4.2 మిలియన్ పేజీలను డిజిటలైజ్ చేసి, 40 కి పైగా మాన్యుస్క్రిప్ట్‌లను శుద్ధి చేసి తిరిగి ప్రచురించిందని తెలిపపారు. జ్ఞాన్ భారతం క్లస్టర్ కేంద్రంగా పతంజలి ఇప్పుడు 20 కేంద్రాలకు శిక్షణ ఇస్తోందని తెలిపారు.

యోగాకు సంబంధించిన మాన్యుస్క్రిప్ట్‌లపై పరిశోధన

ఈ సందర్భంగా, జ్ఞాన్ భారతం మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ అనిర్వన్ దాష్ మాట్లాడుతూ, జ్ఞాన్ భారతం మిషన్ కింద క్లస్టర్ కేంద్రంగా ఉన్న పతంజలి విశ్వవిద్యాలయం యోగా, ఆయుర్వేదం ఆధారంగా మాన్యుస్క్రిప్ట్‌లపై పరిశోధన చేయడమే కాకుండా, దానిని విద్యా విప్లవంతో అనుసంధానించి దేశానికి, సమాజానికి చేరేలా చేస్తుందని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.