కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు కలకలం లేపింది. విమానంలో బాంబు ఉందని టేకాఫ్‌కు ముందు ఒక వ్యక్తి అరవడం ప్రారంభించడంతో ప్రయాణికులందరినీ విమానం నుంచి దించారని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. కోల్‌కతా నుంచి దోహా వెళ్తున్న ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో బాంబు ఉందంటూ ఓ ప్రయాణికుడు కేకలు వేయడంతో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని ల్యాండింగ్ చేశారు. వెంటనే సీఐఎస్‌ఎఫ్‌కు సమాచారం అందించారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు దింపేశారు. స్నిఫర్ డాగ్ సహాయంతో విమానంలో క్షుణ్ణంగా పరిశీలించారు. విమానం మొత్తం పరిశీలించిన ఎలాంటి ప్రమాదకర అనవాళ్లు లేవని గుర్తించారు. దీంతో ప్రయాణీకులు, ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
అందిన సమాచారం ప్రకారం.. మంగళవారం (జూన్ 6) తెల్లవారుజామున 3.29 గంటలకు కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 541 మంది ప్రయాణికులతో దోహా మీదుగా లండన్‌కు వెళ్లే ఖతార్ ఎయిర్‌వేస్ విమానం టేకాఫ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఇంతలో ఓ ప్రయాణికుడు బాంబు ఉందంటూ అరిచాడు. విమాన సిబ్బంది వెంటనే సీఐఎస్‌ఎఫ్‌కు సమాచారం అందించారు. ప్రయాణికులను దించేశారు.దీని తర్వాత స్నిఫర్ డాగ్స్ సహాయంతో విమానం మొత్తం వెతికినా అనుమానాస్పదంగా ఏమీ దొరకలేదు. అనంతరం బాంబు ఉందంటూ కేకలు వేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఎయిర్ పోర్టు ఆధ్వర్యంలో కస్టోడియల్ ఇంటరాగేషన్ తర్వాత.. సదరు వ్యక్తి తండ్రిని విమానాశ్రయానికి పిలిపించి విచారించగా… తన కొడుకు మానసిక స్థితి సరిగా లేదనీ, మానసిక వ్యాధికి చికిత్స పొందుతున్నాడని తెలిపే కొన్ని పత్రాలను భద్రతా సిబ్బందికి సమర్పించాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.