Lok Sabha Speaker Election: కుదరని ఏకాభిప్రాయ ప్రయత్నాలు.. లోక్‌సభ స్పీకర్‌ ఎన్నికపై ఉత్కంఠ..!

|

Jun 26, 2024 | 10:47 AM

ఎన్డీయే సర్కార్, ప్రతిపక్ష కూటమి భారత్ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో లోక్‌సభ స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో బుధవారం (జూన్ 26) సభలో ఎన్నిక జరగనుంది. లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక ఆసక్తి రేపుతోంది. విపక్షం తన బలాన్ని చాటుకోవడానికి ఈ ఎన్నిక అవకాశంగా మారబోతోంది. తటస్థులు ఎటువైపు ఉన్నారో కూడా తేలబోతోంది.

Lok Sabha Speaker Election: కుదరని ఏకాభిప్రాయ ప్రయత్నాలు.. లోక్‌సభ స్పీకర్‌ ఎన్నికపై ఉత్కంఠ..!
Om Birla K Suresh
Follow us on

ఎన్డీయే సర్కార్, ప్రతిపక్ష కూటమి భారత్ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో లోక్‌సభ స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో బుధవారం (జూన్ 26) సభలో ఎన్నిక జరగనుంది. లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక ఆసక్తి రేపుతోంది. విపక్షం తన బలాన్ని చాటుకోవడానికి ఈ ఎన్నిక అవకాశంగా మారబోతోంది. తటస్థులు ఎటువైపు ఉన్నారో కూడా తేలబోతోంది.

లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక ఉత్కంఠ భరితంగా మారింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత లోక్‌సభ చరిత్రలో తొలిసారి స్పీకర్‌ ఎన్నిక జరగబోతోంది. పైకి ఎన్డీఏ కూటమికే స్పష్టమైన ఆధిక్యం కన్పిస్తునప్పటికి ఇండియా కూటమి కూడా గట్టి పోటీ ఇస్తోంది. చాలా వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌ తన అభ్యర్ధిగా సురేశ్‌ను బరి లోకి దింపింది. స్పీకర్‌ ఎన్నికపై ఏకాభిప్రాయం కోసం చాలా ప్రయత్నాలు జరిగాయి. విపక్షాల మద్దతను కూడగట్టే బాధ్యతను కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు అప్పగించారు. అయితే ప్రోటెం స్పీకర్‌ విషయంలో బీజేపీ , కాంగ్రెస్‌ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ప్రోటెం స్పీకర్‌ బీజేపీ నుంచి భర్తృహరి మెహతాబ్‌ను నియమించడంతో కాంగ్రెస్‌ తప్పకుండా ఎన్నికల బరి లోకి దిగాలని నిర్ణయించింది.

ఇవాళ (జూన్ 26) లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే, ఇప్పటివరకు పార్లమెంటు సభ్యత్వ ప్రమాణ స్వీకారం చేయని కొత్తగా ఎన్నికైన ఎంపీల చేత ప్రమాణం చేయిస్తారు. దీని తరువాత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభలో కొత్త లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తారు. ప్రతిపక్షం లేకుండా ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అన్ని పార్టీలను కోరుతారు. ప్రభుత్వం చేసిన వినతిని ప్రతిపక్షం తరపున లోక్‌సభ స్పీకర్ అభ్యర్థిగా కె. సురేష్ పేరును ప్రతిపాదించకపోతే, ఓం బిర్లా లోక్‌సభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. ప్రతిపక్షాలు తమ అభ్యర్థి పేరును ప్రతిపాదిస్తే, అప్పుడు సభలో ఎన్నికలు జరుగుతాయి. లోక్‌సభ స్పీకర్‌ పదవికి ఓటింగ్‌ జరిగితే స్లిప్‌ల ద్వారానే ఈ ఓటింగ్‌ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేసిన కొత్తగా ఎన్నికైన ఎంపీలు ఓటింగ్ ద్వారా లోక్‌సభకు కొత్త స్పీకర్‌ను ఎన్నుకుంటారు.

డిప్యూటీ స్పీకర్‌ పదవి విపక్షాలు ఇస్తే స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉండేది. కాని డిప్యూటీ స్పీకర్‌ పదవిని కూడా విపక్షాలకు ఇచ్చేందుకు బీజేపీ సిద్దంగా లేదు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుందన్నారు కాంగ్రెస్‌ స్పీకర్‌ అభ్యర్ధి కే.సురేశ్‌. పార్లమెంట్‌ సాంప్రదాయాన్ని మోదీ కాలరాస్తున్నారని ఆయన విమర్శించారు.

ఎవరి సంఖ్యాబలం ఎంత..?

సభలో సంఖ్యా బలం గురించి చూస్తే, బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి అభ్యర్థి ఓం బిర్లా ఈ ఎన్నికల్లో సులభంగా గెలుపొందడం ఖాయమని భావిస్తున్నారు. ప్రస్తుతం లోక్‌సభలో బలాబలాలు చూస్తే ఎన్డీఏ కూటమికి 293 మంది సభ్యులు ఉన్నారు. ఇండియా కూటమికి 234 మంది సభ్యుల బలం ఉంది. ఏ కూటమి లోని సభ్యులు 16 మంది ఉన్నారు. ఎలా చూసినా ఓం బిర్లా స్పీకర్ కావడం లాంఛనమే అయినా దేశ చరిత్రలో స్పీకర్ ఎన్నిక జరగడం అత్యంత చర్చనీయ అంశంగా మారింది. స్పీకర్‌ ఎన్నిక తటస్థ పార్టీలు ఎటు వైపు ఉన్నాయో తేల్చబోతున్నాయి. ముఖ్యంగా వైసీపీ లాంటి పార్టీల అభిప్రాయం ఇప్పటికే వెల్లడయ్యింది. ఎన్డీఏ అభ్యర్ధి ఓంబిర్లాకు వైసీపీ మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి సంఖ్యా బలం ఉందని, సంప్రదాయం ప్రకారం లోక్‌సభ స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..