Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారు.. ఏర్పాట్లను పరిశీలించిన స్పీకర్..

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహుర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 19 నుంచి పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం కానున్నాయ‌ని లోక్‌స‌భ స్పీక‌ర్ ఓంబిర్లా ప్రక‌టించారు.

Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారు.. ఏర్పాట్లను పరిశీలించిన స్పీకర్..
Parliament Monsoon Session

Updated on: Jul 12, 2021 | 2:42 PM

Parliament Monsoon Session from July 19: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహుర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 19 నుంచి పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం కానున్నాయ‌ని లోక్‌స‌భ స్పీక‌ర్ ఓంబిర్లా ప్రక‌టించారు. జూలై 19 నుంచి ఆగ‌స్టు 13 వరకు స‌మావేశాలు కొన‌సాగుతాయ‌ని ఆయ‌న తెలిపారు. ఆ రెండు తేదీల మ‌ధ్య సెలవు దినాలు మినహా మొత్తం 19 రోజులపాటు ఉభ‌య‌స‌భ‌ల కార్యక‌లాపాలు జ‌రుగుతాయ‌ని చెప్పారు. పార్లమెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల ప్రారంభం కానున్న నేప‌థ్యంలో స్పీక‌ర్ ఓంబిర్లా ఇవాళ ఏర్పాట్లను ప‌ర్యవేక్షించారు.

అయితే, ఈ సంద‌ర్భంగా స్పీక‌ర్‌ స‌మావేశాల నిర్వహ‌ణ‌కు సంబంధించి కాసేపు మీడియాతో మాట్లాడారు. కోవిడ్ నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి వ‌చ్చే ఎంపీలు, మీడియా ప్రతినిధులు అంద‌రినీ పార్లమెంటు లోప‌లికి అనుమ‌తిస్తార‌ని స్పీక‌ర్ ఓం బిర్లా స్పష్టంచేశారు. ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష రిపోర్టు త‌ప్పనిస‌రి కాద‌ని తేల్చి చెప్పారు. అయితే, ఇప్ప‌టికీ వ్యాక్సిన్ వేయించుకోని వారు మాత్రం ద‌య‌చేసి వ్యాక్సిన్‌లు వేయించుకోవాల‌ని ఆయ‌న విజ్ఞప్తి చేశారు.

ఇక పార్లమెంట్ స‌మావేశాలు ప్రతిరోజు ఉద‌యం 11 గంట‌లకు మొద‌లై సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని స్పీక‌ర్ ఓం బిర్లా పేర్కొన్నారు. పార్లమెంట్ ఉభ‌య‌స‌భ‌ల‌ు లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌ ఇవే టైమింగ్స్ వ‌ర్తిస్తాయ‌ని ఆయ‌న వెల్లడించారు.