21 ఏళ్ల యువకుడు యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో మెదడు దెబ్బతిని స్తంభించిపోయింది. దీంతో యువకుడి కుటుంబ సభ్యులు అతని అవయవాలను దానం చేశారు. ఈ సంఘటన మైసూరులోని మండ్య జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని పాండవపురలోని సింగపురా గ్రామానికి చెందిన సచిన్ బ్రెయిన్ డెడ్ కావటంతో ఎస్‌ఎ జెఎస్‌ఎస్ ఆసుపత్రిలో చేర్చారు. అతని గుండె, రెండు కార్నియా (కళ్ళు), రెండు కిడ్నీలు, కాలేయం దానం చేశారు అతని కుటుంబ సభ్యులు. ఒక కిడ్నీ, కాలేయాన్ని బిజిఎస్ గ్లోబల్ ఆసుపత్రికి, గుండెను బెంగళూరులోని వైదేహి ఆసుపత్రికి, పోలీసుల సహకారంతో రూపొందించిన గ్రీన్ కారిడార్‌లో పంపారు. మైసూరులోని జేఎస్‌ఎస్ ఆస్పత్రిలో రోగికి కిడ్నీని అమర్చారు. రెండు కార్నియాలను బెంగళూరులోని లయన్స్ ఆసుపత్రికి తరలించారు. కొడుకు పోయిన పుట్టేడు దుఖఃలోనూ ఆ తల్లిదండ్రులు సచిన్ అవయవాలను దానం చేసి మానవత్వం చాటుకుంది ఆ కుటుంబం.
కొడుకు బతకడని తెలిసిన కుటుంబ సభ్యులు తమ బాధను దిగమింగుకున్నారు. వైద్యుల సలహా మేరకు సచిన్ అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నారు. దీని ద్వారా చాలా మంది రోగులకు సహాయం చేసి సచిన్ వారిని తిరిగి బ్రతికించాడు. అనంతరం కుటుంబసభ్యుల అంగీకారంతో జేఎస్‌ఎస్ ఆస్పత్రి వైద్యులు సచిన్ గుండె, కిడ్నీ, కళ్లను బయటకు తీశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు సచిన్ అవయవాలను దానం చేశారు. సచిన్ అవయవాలను దానం చేసిన కుటుంబ సభ్యులకు ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు ప్రశంసలు కురిపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి