Parakram Diwas 2023: రియల్ హీరోలకు ప్రధాని మోడీ నిజమైన నివాళి.. పరాక్రమ్ దివస్‌ సందర్భంగా 21 దీవులకు ఆ వీరుల పేర్లు..

|

Jan 23, 2023 | 7:53 AM

పరాక్రమ్ దివస్ సందర్భంగా, అండమాన్, నికోబార్‌లోని 21 పెద్ద దీవులకు ప్రధాని మోదీ పేరు పెట్టనున్నారు. ఈ ద్వీపాలు పరమవరి చక్ర విజేతలుగా పిలువబడతాయి. ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Parakram Diwas 2023: రియల్ హీరోలకు ప్రధాని మోడీ నిజమైన నివాళి.. పరాక్రమ్ దివస్‌ సందర్భంగా 21 దీవులకు ఆ వీరుల పేర్లు..
Parakram Diwas
Follow us on

స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్ జయంతిని కేంద్ర ప్రభుత్వం పరాక్రమ్‌ దివస్‌గా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నేతాజీ సుభాస్ చంద్రబోస్ జయంతిని.. పరాక్రమ్ దివస్‌గా అధికారంగా నిర్వహించాలని 2021లో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటినుంచి నేతాజీ సుభాస్ చంద్రబోస్ జయంతిని.. ఏటా జనవరి 23న పరాక్రమ్‌ దివస్‌గా నిర్వహిస్తూ నివాళులర్పిస్తోంది. ఈ ఏడాది పరాక్రమ్ దివస్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లను.. అండమాన్ అండ్‌ నికోబార్ దీవులలోని పేరు లేని అతిపెద్ద 21 దీవులకు వారి పేర్లను పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. నేతాజీ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఉదయం 11 గంటలకు జరిగే పరాక్రమ్‌ దివస్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని.. 21 అతిపెద్ద దీవులకు 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహితల పేర్లు పెట్టనున్నారు.

ఈ కార్యక్రమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపంలో నిర్మించనున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ నేషనల్ మెమోరియల్ నమూనాను కూడా ప్రధాని ఆవిష్కరించనున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జ్ఞాపకార్థం.. అండమాన్ – నికోబార్ దీవుల చారిత్రక ప్రాముఖ్యతను పురస్కరించుకుని, ప్రధాన మంత్రి 2018లో ద్వీపాన్ని సందర్శించిన సందర్భంగా రాస్ దీవులకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్ అని నామకరణం చేశారు. నీల్ ద్వీపం, హేవ్‌లాక్ ద్వీపాన్ని షహీద్ ద్వీప్, స్వరాజ్ ద్వీప్‌గా పేర్లను ప్రకటించారు.

దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన నిజమైన హీరోలకు నివాళులు అర్పించే విషయంలో.. వారికి సముచిత ప్రాధాన్యం కల్పించే విషయంలో ప్రధానమంత్రి మోడీ ఎల్లప్పుడూ ముందుంటారు. ఈ స్పూర్తికి అనుగుణంగా ప్రధానమంత్రి మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారు. అండమాన్‌ ద్వీప సమూహంలోని 21 పెద్ద పేరులేని ద్వీపాలకు 21 మంది పరమవీర చక్ర గ్రహీతల పేరు పెట్టాలని నిర్ణయించినట్లు పీఎంఓ పేర్కొంది. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడేందుకు జీవితాన్ని త్యాగం చేసిన వీరులకు ఇదే ఘనమైన నివాళి అంటూ వెల్లడించింది.

21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు ఇవే..

ఈ ద్వీపాలకు 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు పెట్టనున్నారు.

  1. మేజర్ సోమనాథ్ శర్మ
  2. సుబేదార్ – హోనీ కెప్టెన్ (అప్పటి లాన్స్ నాయక్) కరమ్ సింగ్
  3. 2వ లెఫ్టినెంట్ రామ రఘోబా రాణే
  4. నాయక్ జాదునాథ్ సింగ్
  5. కంపెనీ హవల్దార్ మేజర్ పిరు సింగ్
  6. కెప్టెన్ GS సలారియా
  7. లెఫ్టినెంట్ కల్నల్ (అప్పటి మేజర్) ధన్ సింగ్ థాపా
  8. సుబేదార్ జోగిందర్ సింగ్
  9. మేజర్ షైతాన్ సింగ్
  10. సీక్యూఎంహెచ్ అబ్దుల్ హమీద్
  11. లెఫ్టినెంట్ కల్నల్ అర్దేషిర్ బుర్జోర్జీ తారాపూర్
  12. లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా
  13. మేజర్ హోషియార్ సింగ్
  14. 2వ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్
  15. ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్‌జిత్ సింగ్ సెఖోన్
  16. మేజర్ రామస్వామి పరమేశ్వరన్
  17. నాయబ్ సుబేదార్ బనా సింగ్
  18. కెప్టెన్ విక్రమ్ బాత్రా
  19. లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే
  20. సుబేదార్ మేజర్ (అప్పటి రైఫిల్ మాన్) సంజయ్ కుమార్
  21. సుబేదార్ మేజర్ రిటైర్డ్ (హానీ కెప్టెన్) గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్.. ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..