PAN CARD: మీరు ఇలా చేయకపోతే మీ పాన్‌ కార్డు రద్దు.. రూ.10 వేల జరిమానా.. తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు

|

Feb 26, 2021 | 9:02 PM

PAN CARD: మీరు ఆధార్‌ కార్డుతో పాన్‌ కార్డు లింక్‌ చేస్తున్నారా..? లేకపోతే వెంటనే చేసుకోండి. ఎందుకంటే ఆలస్యం అయినట్లయితే భారీగా జరిమానా కట్టాల్సి ఉంటుంది. గతంలో ఆధార్‌ ...

PAN CARD: మీరు ఇలా చేయకపోతే మీ పాన్‌ కార్డు రద్దు.. రూ.10 వేల జరిమానా.. తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు
Follow us on

PAN CARD: మీరు ఆధార్‌ కార్డుతో పాన్‌ కార్డు లింక్‌ చేస్తున్నారా..? లేకపోతే వెంటనే చేసుకోండి. ఎందుకంటే ఆలస్యం అయినట్లయితే భారీగా జరిమానా కట్టాల్సి ఉంటుంది. గతంలో ఆధార్‌ కార్డుతో పాన్‌ కార్డు అనుసంధానం చేయకపోతే వినియోగదారుడికి పాన్‌ కార్డును రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేయాలన్నా, బ్యాంక్‌ ఖాతా తెరవాలన్నా, అలాగే రూ.50వేలకుపైగా నగదు లావాదేవీలు జరపడం, మ్యూచువల్​ ఫండ్స్​ లేదా షేర్లలో పెట్టుబడి పెట్టడం, మీ ఆధార్​ కార్డుకు పాన్​కార్డు లింక్​ తప్పనిసరి చేసింది. అయితే ఆధార్‌ కార్డుతో పాన్‌ కార్డు లింక్‌ చేయడానికి 2021 మార్చి 31 వరకు గడువు విధించింది ఆదాయ పన్ను శాఖ. ఈ గడువులోగా అనుసంధానం చేయకపోతే 2021 ఏప్రిల్​ 1 నాటికి మీ పాన్​ కార్డు రద్దవుతుందని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. రద్దయిన మీ పాన్‌ కార్డు కోసం జరిమానా కట్టాల్సి ఉంటుందని ఆదాయపన్ను శాఖ హెచ్చరించింది. అంతేకాదు.. రద్దయిన పాన్‌ కార్డు కలిగి ఉన్నవారిని పాన్‌ కార్డు లేనివారిగా పరిగణిస్తామని పేర్కొంది. ఇక ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్‌ 272బి కింద వారికి రూ.10 వేల జరిమానా కూడా విధిస్తామని స్పష్టం చేసింది.

అయితే ..  మీరు బ్యాంకుకు వెళ్లి ఖాతా ఓపెన్‌ చేయడం, లేదా రూ.50వేలకు మించి నగదు జమ చేయడం, లేదా ఉపసంహరణకు మీరు మీ పాన్‌ కార్డు నెంబర్‌ను తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. మీరు రద్దయిన లేదా పని చేయని పాన్‌ కార్డు నెంబర్‌ ఇస్తే మీకు రూ.10వేల జరిమానా విధించే అవకాశం ఉంది. అందు వల్ల గడువులోగా మీ పాన్‌ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లేకపోతే చిక్కుల్లో పడటం ఖాయని, గడువులోగా ఆలస్యం చేయకుండా ఈ పనిని పూర్తి చేయాలని ఆదాయ పన్ను శాఖ కోరుతోంది. ఒక వేళ ఇప్పటికీ మీ మీ ఆధార్‌తో పాన్‌ నెంబర్‌ అనుసంధానం చేయకపోతే SMS ద్వారా కూడా చేసుకోవచ్చని తెలిపింది. లేదా మీ ఖాతా ఉన్న బ్రాంచ్‌కు వెళ్లి కూడా చేసుకోవచ్చని సూచించింది.

SMS ఎలా చేయాలి..

ఎస్‌ఎంఎస్‌ ద్వారా కూడా పాన్‌ ఆధార్‌ లింక్‌ చేసుకోవచ్చు. ఇందు కోసం మీ రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌ నుంచి UIDAIPAN అని టైప్​ చేసి మీ 12 అంకెల ఆధార్ సంఖ్యను ఎంటర్​ చేయండి. ఆ తర్వాత స్పేస్​ ఇచ్చి మీ 10 అంకెల పాన్​ కార్డు నెంబర్​ను ఎంటర్​ చేయండి. దీన్ని 567678 లేదా 56161 నంబర్​కు SMS పంపించండి. అంతే మీ పని పూర్తయినట్లే. వెంటనే మీ ఆధార్‌తో పాన్‌ కార్డు అనుసంధానం అయినట్లు మీ మొబైల్‌ నెంబర్‌కు సందేశం వస్తుంది.

Also Read: Fuel Prices: శీతాకాలం తర్వాత పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుతాయి.. కీలక వ్యాఖ్యలు చేసిన పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌