పాల్ఘర్ సామూహిక దాడి కేసులో ముగ్గురు పోలీసుల డిస్మిస్

| Edited By: Anil kumar poka

Aug 31, 2020 | 10:40 AM

మహారాష్ట్రలోని గచించాలె  గ్రామంలో గత ఏప్రిల్ 16 న ఇద్దరు సాధువులను, కారు డ్రైవర్ ను స్థానికులు సామూహికంగా కొట్టి చంపిన కేసులో  ముగ్గురు పోలీసులను ప్రభుత్వం డిస్మిస్ చేసింది.

పాల్ఘర్ సామూహిక దాడి  కేసులో ముగ్గురు పోలీసుల డిస్మిస్
Follow us on

మహారాష్ట్రలోని గచించాలె  గ్రామంలో గత ఏప్రిల్ 16 న ఇద్దరు సాధువులను, కారు డ్రైవర్ ను స్థానికులు సామూహికంగా కొట్టి చంపిన కేసులో  ముగ్గురు పోలీసులను ప్రభుత్వం డిస్మిస్ చేసింది. వీరిలో ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు, ఓ హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు. ఈ కేసులో మొత్తం 150 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సాధువులు కారులో ముంబై నుంచి సూరత్ వెళ్తుండగా వారి కారును అడ్డగించిన గుంపు కర్రలు, రాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. ఆ దాడిలో కారు డ్రైవర్ సహా ఇద్దరు సాధువులు కూడా ఆ తరువాత మరణించారు. వీరిని పిల్లలను ఎత్తుకుపోయే ముఠాగా అనుమానించిన స్థానికులు నిర్దాక్షిణ్యంగా ఈ ఎటాక్ కి పాల్పడ్డారు. కనీసం వారు చెబుతున్నది కూడా వినిపించుకోలేదని తెలిసింది.

ఈ కేసు విచారణ కోర్టులో  సుదీర్ఘకాలం సాగింది. సీఐడీ అధికారులు రెండు చార్జిషీట్లు దాఖలు చేశారు.  మొదట ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణపై ముగ్గురు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వారిని ఇప్పుడు విధుల నుంచి తొలగించింది.