మహారాష్ట్రలోని పాల్ఘర్ లో గత ఏప్రిల్ నెలలో ఇద్దరు సాధువుల హత్యను మీడియా అధర్మమని అంటోందని, కానీ ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ విధమైన సంఘటనల మాటేమిటని శివసేన నేత సంజయ్ రౌత్ ప్రశ్నించారు. వాటిని పాల్గర్ ఘటన మాదిరి మీడియా చూడడంలేదన్నారు. గత 4 రోజుల్లో యూపీలో నలుగురు సాధువులు హత్యకు గురయ్యారని, రాజస్తాన్ లో ఓ పూజారిని సజీవదహనం చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ విధమైన సంఘటనలను మీడియా కేవలం సంఘటనలుగా చెబుతోందని, అంటే ఇది మీడియా ద్వంద్వ వైఖరి కాక మరేమిటన్నారు. తన ‘సామ్నా’ పత్రికలో ఆయన ఇలా మీడియాపై ధ్వజమెత్తారు.