Pak Woman Village Head: ఉత్తరప్రదేశ్ లో ఓ పంచాయతీ సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించిన ఓ పాక్ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ మహిళ ఇండియాలో గ్రామ సర్పంచ్ కావడం ఏంటని ఆశ్చర్య పోతున్నారా? అవును..ఈ ఘటన జలేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పాక్ కు చెందిన బానో బేగమ్ అనే మహిళ.. గడావు గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరించింది. ఈ విషయమై ఫిర్యాదులు రావడంతో జలేసర్ పోలీసులు కేసు నమోదు చేసి..దర్యాప్తు చేస్తున్నారు.
దర్యాప్తులో విస్తుబోయే నిజాలు వెలికి వస్తున్నాయి. ఈ పాక్ మహిళ ఐదేళ్ల పాటు గ్రామ వార్డు సభ్యురాలిగా పనిచేసింది. ఏడాది క్రితమే తాత్కాలిక సర్పంచ్ గా బాధ్యతలు తీసుకుంది.. ఆ పదవిలో ఉండే సరికి అందరూ ఊరిపెద్దే అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఆమె 65 ఏళ్ల ఓ పాకిస్థానీ అని తెలిసి అంతా షాక్ అయ్యారు. కాగా, అసలు పౌరసత్వమే లేని ఆమెకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆధార్, ఓటర్ ఐడీ ఎలా వచ్చాయన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.
బానో బేగమ్ పాకిస్థాన్ జాతీయురాలని, ఆమె అనధికారికంగా గ్రామ పంచాయతీ తాత్కాలిక సర్పంచ్‌గా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో అసలు గుట్టు బయటపడింది. ఆమె 2015లో పంచాయతీ వార్డు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. తర్వాత అక్కడి గ్రామ సర్పంచ్ మరణించడంతో బానో బేగమ్ తాత్కలిక సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇదిలావుంటే.. పాకిస్థాన్ లోని కరాచీకి చెందిన బానో బేగమ్.. 40 ఏళ్ల క్రితం ఈటాలోని తన బంధువు ఇంటికి వచ్చింది. అక్కడే ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి ఈటాలోనే దీర్ఘకాలిక వీసాపై ఆమె నివాసం ఉంటోంది. పలుమార్లు భారత పౌరసత్వానికి దరఖాస్తు చేసినా రాలేదు. ఆపై తన వీసాను పొడిగించుకుంటూ ఇండియాలోనే ఉండిపోయినట్టు సమాచారం.
Also Read: