India vs Pakistan: భారత సైన్యం అదుపులో పాక్ F- 16 పైలట్‌

యుద్ధాన్ని కోరుకోవడంలేదంటూ ఓవైపు మొసలి కన్నీరు కారుస్తూనే మరోవైపు బోర్డర్‌ పొడువుతా దాడులకు బరితెగించింది పాకిస్థాన్‌. కానీ ఆ కవ్వింపు చర్యలు హనుమంతుడి ముంది కుప్పి గంతులా అయ్యాయి. దూది పింజల్లా పాక్‌ దాడులను తిప్పికొట్టింది భారత్‌. ఆపరేషన్‌ సింధూర్‌ ఆన్‌ యాక్షన్‌. త్రిశూల్‌ వ్యూహంతో పాక్‌ భరతం పడుతోంది భారత్‌.

India vs Pakistan:  భారత సైన్యం అదుపులో పాక్ F- 16 పైలట్‌
India Vs Pakistan

Updated on: May 08, 2025 | 11:05 PM

పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పి కొడుతోంది భారత్.  పాక్ ప్రయోగించిన డ్రోన్లు, రాకెట్లను నేలమట్టం చేసింది. తాజాగా  జమ్మూలోని అఖ్నూర్ సమీపంలో పాక్  ‌కు చెందిన  F- 16 పైలట్‌ను భారత్ పట్టుకున్నట్లు సమాచారం అందుతోంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేసిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు చావుదెబ్బ తగిలింది. అయినా ఆ దేశం తన వక్రబుద్ధిని మార్చుకోకుండా.. భారత్‌పైకి దాడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. జమ్ము, పఠాన్‌కోట్‌, ఉధంపూర్‌ సైనిక స్థావరాలపై పాకిస్తాన్‌ దాడులకు తెగబడిందని రక్షణశాఖ తెలిపింది. పాక్‌ ప్రయోగించిన ఎనిమిది మిసైల్స్‌ను భారత సైన్యం వీరోచితంగా కూల్చేసింది. పాక్‌ దాడుల్లో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. పాక్‌ దాడులను సమర్థంగా తిప్పికొట్టామని రక్షణశాఖ వెల్లడించింది.

ఉగ్రవాదుల అంతమే పంతంగా భారత్‌ త్రిశూల్‌ వ్యూహంతో దూసుకెళ్తోంది. ఉగ్రవాదుల ఏరివేత..టెర్రర్‌ డెన్‌లను మట్టుపెట్టడమే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ కొనసాగింపు.. భారత్‌లోని స్లీపర్ సెల్స్‌ ఏరివేత, దేశంలో రక్షణ పటిష్టం చెయ్యడం… యుద్ధోన్మాదంతో పాక్‌ కయ్యానికి కాలు దువ్వితే అందుకు దీటుగా సమాధానం ఇవ్వడం.. ఈ మూడు అంశాలనూ ఏకకాలంలో ఆపరేట్‌ చేస్తున్నాయి భారత బలగాలు .మరోవైపు ఉగ్రవాద బరితెగింపును.. పాక్‌ కవ్వింపు చర్యలను ఎండగడుతూ దౌత్య సంబంధాలతో అంతర్జాతీయంగా మద్దతును కూడగట్టుకుంటోంది భారత్‌.