భారత్‌తో తెగదెంపులే .. పాక్ కీలక నిర్ణయం

| Edited By:

Aug 07, 2019 | 9:05 PM

ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్తాన్ ప్రభుత్వంలో కదలిక మొదలైంది. రద్దు ప్రకటనతో విద్వేషపూరితంగా వ్యాఖ్యానించిన ఆదేశం ఇప్పడు భారత్‌తో సంబంధాలను కొనసాగించాలా వద్దా అనే విషయాలపై సమీక్షించింది. పాక్ భద్రతా కమిటీ భేటీలో ఈ మేరకు పాక్ నిర్ణయం తీసుకుంది. భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యం నిలిపివేయాలని, అలాగే దౌత్య సంబంధాలను కూడా తగ్గించాలని నిర్ణయించింది. మరోవైపు పాకిస్థాన్ భారత రాయబారిని బహిష్కరించింది. జమ్ము కశ్మీర్‌కు ఇప్పటివరకు ఉన్న స్వయం ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని తొలగిస్తూ […]

భారత్‌తో తెగదెంపులే .. పాక్ కీలక  నిర్ణయం
Follow us on

ఆర్టికల్ 370 రద్దుతో పాకిస్తాన్ ప్రభుత్వంలో కదలిక మొదలైంది. రద్దు ప్రకటనతో విద్వేషపూరితంగా వ్యాఖ్యానించిన ఆదేశం ఇప్పడు భారత్‌తో సంబంధాలను కొనసాగించాలా వద్దా అనే విషయాలపై సమీక్షించింది. పాక్ భద్రతా కమిటీ భేటీలో ఈ మేరకు పాక్ నిర్ణయం తీసుకుంది. భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్యం నిలిపివేయాలని, అలాగే దౌత్య సంబంధాలను కూడా తగ్గించాలని నిర్ణయించింది. మరోవైపు పాకిస్థాన్ భారత రాయబారిని బహిష్కరించింది.

జమ్ము కశ్మీర్‌కు ఇప్పటివరకు ఉన్న స్వయం ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని తొలగిస్తూ భారత పార్లమెంట్ ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై పాక్ విద్వేషపూరితంగా మాట్లాడింది. మరోసారి పుల్వామా తరహా దాడులు జరిగే అవకాశాలున్నాయని, యుద్ధం కూడా జరగవచ్చంటూ వ్యాఖ్యానించింది.