
తమ దేశంలో కరోనా వైరస్ పరిస్థితి మెరుగుపడిన నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం గురుద్వారా కర్తార్ పూర్ సాహిబ్ కారిడార్ ను తిరిగి తెరిచింది. గత ఏడాది భారత-పాకిస్తాన్ దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం మేరకు భారత యాత్రికులు ప్రతిరోజూ ఈ గురుద్వారాను సందర్శించవచ్ఛునని పాక్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇండియాలోని డేరాబాబా నానక్ సాహిబ్ గురుద్వారాను, పాక్ లోని దర్బారా సాహిబ్ ను (సుమారు 4.7 కి.మీ.) కర్తార్ పూర్ సాహిబ్ కారిడార్ కలుపుతుంది. 2019 లో దీన్ని ప్రారంభించారు. అయితే కోవిడ్ మహమ్మారి ప్రబలడంతో తాత్కాలికంగా దీన్ని మూసివేశారు. పాక్ నిర్ణయం పట్ల ఇండియాలోని సిక్కులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.