Flight: భారత గగనతంలోకి ప్రవేశించిన పాకిస్థాన్ విమానం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే

|

May 08, 2023 | 6:49 AM

ఇటీవల పాకిస్థాన్‌కు చెందిన విమానం భారత గగనతలంలోకి ప్రవేశించింది. మే 4వ తేదిన మస్కట్ నుంచి లాహోర్‌కు వెళ్తున్న బోయింగ్ 777కి చెందిన పీకే248 విమానం భారీ వర్షం కారణంగా లాహోర్‌లోని అల్లామ ఇక్బాల్ అంతర్జాతీయ ఏయిర్‌పోర్టులో ల్యాండ్ అవ్వలేకపోయిది.

Flight: భారత గగనతంలోకి ప్రవేశించిన పాకిస్థాన్ విమానం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే
Pakistan Flight
Follow us on

ఇటీవల పాకిస్థాన్‌కు చెందిన విమానం భారత గగనతలంలోకి ప్రవేశించింది. మే 4వ తేదిన మస్కట్ నుంచి లాహోర్‌కు వెళ్తున్న బోయింగ్ 777కి చెందిన పీకే248 విమానం భారీ వర్షం కారణంగా లాహోర్‌లోని అల్లామ ఇక్బాల్ అంతర్జాతీయ ఏయిర్‌పోర్టులో ల్యాండ్ అవ్వలేకపోయిది. ఏయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సూచనల మేరకు పైలెట్ విమానాన్ని ల్యాండ్ చేయకుండా పైలేట్ వేరే మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే వారు దారి తప్పిపోయారు. దీంతో గంటకు 293 కిలోమీటర్ల వేగంతో, 13500 ఫీట్ల ఎత్తులో ఎగురుతున్న ఆ విమానం భారత గగనతంలోకి ప్రవేశించింది.

ఆ విమానం భారత్‌లోని పంజాబ్‌లో టరన్ సహిబ్, రసుల్పూర్ పట్టణాల గుండా 40 కిలోమీటర్లు ప్రయాణించాక నౌషేహ్రా పన్నువాన్ నుంచి వెనక్కి వెళ్లి పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత భారత గగనతలంలోకి ప్రవేశించింది. మళ్లీ పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించి ముల్తాన్‌ వైపుగా ప్రయాణించింది. అయితే సుమారు 10 నిమిషాల పాటు భారత గగనతలంలో 120 కిలోమీటర్ల పాటు ఆ విమానం ప్రయాణించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి