కాంగ్రెస్ నేత పాకిస్తాన్ తో చేతులు కలిపారని, ఇండియాలో రైతుల ఆందోళనకు మద్దతుగా జర్మనీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆఫీసు బేరర్లు పాక్ జాతీయ జెండాను పట్టుకోవడమే ఇందుకు నిదర్శనమని బీజేపీ నేత సురేష్ నఖువా ఆరోపించారు. దీనికి సంబంధించిన ఫోటోను కూడా ఆయన తన ట్వీట్ కి జత చేశారు. పాకిస్తాన్ జాతీయ పతాకాన్ని పట్టుకున్నవారిలో నీలి రంగు దుస్తుల్లో ఉన్న వ్యక్తి చరణ్ కుమార్ అని, ఎర్రని దుస్తుల్లో ఉన్న వ్యక్తి రాజ్ శర్మ అని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ పోస్టుని మరికొంతమంది బీజేపీ నేతలు కూడా షేర్ చేశారు. అయితే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ జర్మనీ అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఓ ప్రకటనను విడులా చేస్తూ.. ఈ ఆరోపణలను ఖండించారు.
రాజ్ శర్మ అనే వ్యక్తి తమ సంస్థలో ఆఫీసు బేరర్ అయినప్పటికీ ఆయన 65 ఏళ్ళ వయస్సు వాడని, కానీ ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి యువకుడని ఆయన అన్నారు. సురేష్ నఖువా రిలీజ్ చేసిన ఫొటో ఇలా ఉంటే.. అసలు ఐఓసీ జర్మనీ సభ్యుల్లో ఒక్కరు కూడా ఇందులో లేరని ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ ఫొటోలో ఉన్న వ్యక్తితో గానీ, ఈ పాకిస్తాన్ జెండా ఘటనతో గానీ తమకెలాంటి సంబంధం లేదన్నారు. బీజేపీ దాని ఐటీ విభాగం.. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను, రైతుల ఆందోళనను దిగజార్చడానికి చేసే ప్రయత్నాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
Pakistani connections of Indian Overseas Congress, Germany @sampitroda @INCIndia https://t.co/tgbCOll44y
— Dr Vijay Chauthaiwale (@vijai63) February 22, 2021
Read More :
మహబూబాబాద్ ను వణికిస్తున్న దెయ్యం భయం.. వైరల్‌గా మారిన దెయ్యం వీడియో..!: Devil Video