నాలుగు రోజులు అదృశ్యమై ఇంటికొచ్చిన భార్య.. పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలన్న భర్త.. సలసలా మరుగుతున్న నూనెలో..!

Viral Video: వక్రబుద్ధికి పరాకాష్ట అంటే ఇదేనేమో.. కట్టుకున్న భార్య నాలుగు రోజులు కనిపించకుండా.. ఆ తర్వాత రోజు ఇంటికి తిరిగి రావడంతో ఓ భర్త ...

నాలుగు రోజులు అదృశ్యమై ఇంటికొచ్చిన భార్య.. పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలన్న భర్త.. సలసలా మరుగుతున్న నూనెలో..!
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 23, 2021 | 3:01 PM

Viral Video: వక్రబుద్ధికి పరాకాష్ట అంటే ఇదేనేమో.. కట్టుకున్న భార్య నాలుగు రోజులు కనిపించకుండా.. ఆ తర్వాత రోజు ఇంటికి తిరిగి రావడంతో ఓ భర్త ఆమెకు అగ్ని పరీక్ష పెట్టాడు. పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలని అందుకోసం సలసలా మరుగుతున్న నూనెలో ఐదు రూపాయల నాణాన్ని వేసి చెయ్యి పెట్టాలని అజ్ఞాపించాడు. అంతటితో ఆగని ఆ ప్రబుద్దుడు.. తతంగాన్ని మొత్తం ఫోన్‌లో రికార్డు చేసి పైశాచికత్వాన్ని ఎంజాయ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..

ఈ ఉదంతం మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌లో చోటు చేసుకుంది. నాగరాజు, లక్ష్మీ(పేర్లు మార్చాం) భార్యాభర్తలు, వీరిద్దరికి ఈ నెల 11న వివాహం జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత… వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు. లక్ష్మీ ఒక్కసారిగా అదృశ్యమైంది. ఇక ఆమె కోసం నాగరాజు అన్ని చోట్లా గాలించాడు. అయిన లాభం లేకపోయింది.

నాలుగు రోజుల తర్వాత లక్ష్మీ ఇంటికి తిరిగి వచ్చింది. తనను ఇద్దరు వ్యక్తులు బంధించి ఉంచారని.. వారి నుంచి తప్పించుకుని వచ్చానని భర్తకు తెలియజేసింది. ఆమె పార్ధీ సముదాయానికి చెందిన మనిషి కావడం వల్ల.. ఆ సముదాయానికి చెందినవారు దేవుడి పేరుతో మరుగుతున్న నూనెలో నాణాన్ని వేసే దురాచారాన్ని పాటిస్తారు. అబద్దం అయితే చెయ్యి కాలుతుందని.. లేనిపక్షంలో చెయ్యి కాలదని వారి నమ్మకం. సరిగ్గా దీన్ని ఆధారంగా చేసుకుని ఆ ప్రబుద్దుడైన భర్త ఈ అగ్నిపరీక్షను ఆమెకు పెట్టాడు. చేసేది ఏమీలేక ఆమె భర్త చెప్పినట్లుగా చేసింది.

ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ నీలం గోర్హే ని ఈ ఘటనపై ఆరా తీసి దర్యాప్తు చేయాలని ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

ఈ ఫోటోలోని రాజకీయ నాయకుడిని గుర్తుపట్టారా.! ఎక్కడో చూసినట్లు ఉందా.?

ఏటీఎం పిన్ మర్చిపోయారా.! డోంట్ వర్రీ.. ఎస్‌బీఐ సరికొత్త ఫీచర్.. వివరాలివే.!

రెప్పపాటులో ఘోరం.. సెల్‌ఫోన్ మోజులో ఒకరు.. ర్యాష్ డ్రైవింగ్‌తో మరొకరు.. వీడియో వైరల్.!

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ వేదికలు ఖరారు.. వివరాలు ఇవిగో.!

యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!