Pakistan Firing Jammu Kashmir: జమ్మూలో పాక్‌ సైన్యం కాల్పులు.. ధీటుగా బదులిస్తున్న భారత సైన్యం

Pakistan Firing Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో రాజౌరి జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంట ఉన్న ఫార్వర్డ్‌ పోస్టులపై శనివారం సాయంత్రం పాక్‌ సైన్యం భారీగా..

Pakistan Firing Jammu Kashmir: జమ్మూలో పాక్‌ సైన్యం కాల్పులు.. ధీటుగా బదులిస్తున్న భారత సైన్యం

Updated on: Jan 02, 2021 | 8:47 PM

Pakistan Firing Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో రాజౌరి జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంట ఉన్న ఫార్వర్డ్‌ పోస్టులపై శనివారం సాయంత్రం పాక్‌ సైన్యం భారీగా కాల్పులకు తెగబడింది. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం వారికి ధీటుగా బదులిస్తోందని ఆర్మీ అధికారులు వెల్లడించారు. సాయంత్రం నుంచి రాజౌరిలోని నౌషెరా సెక్టార్‌లో మోర్జార్లను ప్రయోగించి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆయన అన్నారు. పాక్‌ సైన్యం, భారత సైన్యం మధ్య హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అయితే నౌషెరా సెక్టార్‌లో పాక్‌ కాల్పుల్లో గాయడిన జేసీఓ నాయబ్‌ సుబేదార్‌ రవీందర్‌ శుక్రవారం మరణించారు. అయితే జమ్మూ 2020లో పాక్‌ నియంత్రణ రేఖ వెంట 5,100 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రోజు సగటున 14 కేసులతో 18 ఏళ్లలో ఇది అత్యధికం. ఈ ఉల్లంఘనలో 36 మంది మరణించగా, 130 మందికి పైగా గాయపడ్డారు.

Drugs Seized: ఏం ఐడియారా బాబు..! పొత్తి కడుపులో దాచి రవాణా చేస్తున్న డ్రగ్స్‌ను పట్టుకున్న కస్టమ్స్‌ అధికారులు