కర్నాటకలో ఇక అన్ని రోజులూ షాపులు, మార్కెట్లు ఓపెన్, ఆంక్షలకు స్వస్తి, ఎకానమీకి మళ్ళీ ఊపు, ప్రభుత్వ నిర్ణయం

కర్నాటకలో వారంలో అన్ని రోజులూ, 24 గంటలూ షాపులను, మార్కెట్లను తెరచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతించింది.

కర్నాటకలో ఇక అన్ని రోజులూ షాపులు, మార్కెట్లు ఓపెన్, ఆంక్షలకు స్వస్తి, ఎకానమీకి మళ్ళీ ఊపు, ప్రభుత్వ నిర్ణయం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 02, 2021 | 8:47 PM

కర్నాటకలో వారంలో అన్ని రోజులూ, 24 గంటలూ షాపులను, మార్కెట్లను తెరచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఉపాధిని కల్పించేందుకు, ఆర్థిక వృద్దికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు  ప్రకటించారు. రోజుకు ఏ ఉద్యోగి కూడా 8 గంటలకు మించి పని చేయరాదని, ఒకవేళ పని చేయాల్సి వస్తే రెండు గంటలు చేయవచ్ఛునని, ఇందుకు యజమానులు వారికి ఓవర్ టైం అలవెన్సు ఇవ్వాల్సి ఉంటుందని వీరు   పేర్కొన్నారు. షాపు లేదా ఏ మార్కెట్ యజమానులైనా నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ప్రభుత్వం ఓ  సర్క్యులర్ లో హెచ్ఛరించింది. అలాగే మహిళా ఉద్యోగులకు, వర్కర్ల రక్షణ, భద్రతకు సంబంధించి కూడా ఇందులో మార్గదర్శక సూత్రాలను పొందుపరిచారు. ఈ కొత్త గైడ్ లైన్స్ మూడేళ్ళ పాటు అమలులో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏ మహిళా ఉద్యోగి అయినా రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటలవరకు పని చేయాల్సి వస్తే వారికి తప్పనిసరిగా భద్రత కల్పించాలన్నది వీటిలో ముఖ్యమైనది. ఇప్పటికే కోవిడ్ కారణంగా రాష్ట్రం ఆర్థికంగా చాలా నష్టపోయినందున ఈ చర్యలు తీసుకున్నట్టు ఈ  సర్క్యులర్ లో వివరించారు.