
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికా పర్యటన సందర్భంగా భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ భారత్ గురించి చేసిన ఆరోపణలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ అణ్వాయుధ కత్తులు ఊపుతోంది అనేదానికి ఇది ఒక ఉదాహరణ అని అభివర్ణించింది.
అణ్వాయుధాలతో బెదిరించడం పాకిస్తాన్‌కు పాత అలవాటు. ఇలాంటి ప్రకటనలు ఎంత బాధ్యతారహితంగా ఉన్నాయో అంతర్జాతీయ సమాజం స్వయంగా చూస్తోంది. ఉగ్రవాద సంస్థలతో సైన్యం కుమ్మక్కైన దేశాన్ని అణ్వాయుధాల నియంత్రణ, బాధ్యతతో విశ్వసించలేమనే అనుమానాన్ని కూడా ఈ ప్రకటనలు బలపరుస్తున్నాయి అని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.
ఈ ప్రకటనలో విదేశాంగ మంత్రిత్వ శాఖ అమెరికాను కూడా వదల్లేదు. అమెరికాను ప్రస్తావిస్తూ భారతదేశంతో మంచి సంబంధాలు కలిగి ఉన్న దేశం నుండి ఇటువంటి ప్రకటనలు చేయడం విచారకరమని కూడా చెప్పబడింది. అణు బెదిరింపులకు తలొగ్గబోమని భారతదేశం ఇప్పటికే స్పష్టం చేసింది. మన జాతీయ భద్రతను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటూనే ఉంటామని రణధీర్ జైస్వాల్ అన్నరు.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికాలోని ఫ్లోరిడా నుండి భారతదేశాన్ని అణు దాడితో బెదిరించారు. ఫ్లోరిడాలో ప్రవాస పాకిస్తానీయులతో మాట్లాడుతూ.. పాకిస్తాన్ అణ్వస్త్ర సంపన్న దేశం అని మునీర్ చెప్పారు. ఎవరైనా పాకిస్తాన్‌ను ముంచెత్తడానికి ప్రయత్నిస్తే, సగం ప్రపంచాన్ని మనతో తీసుకెళ్తాం. అలాగే సింధు నది గురించి కూడా ప్రస్తావించారు. భారతదేశం సింధు నదిపై ఆనకట్ట నిర్మించబోతోందని, ఒక వేళ ఆనకట్ట నిర్మిస్తే.. క్షిపణి దాడితో దానిని నాశనం చేస్తామని హెచ్చరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి