పాక్ వక్ర బుద్ది.. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు

పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. సరిహద్దుల్లో మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. మోర్టార్లు, తేలికపాటి ఆయుధాలతో పాక్ బలగాలు శనివారం నాడు కాల్పులకు తెగబడ్డాయి. అయితే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. పాక్ దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టింది. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా మెంథార్ సెక్టార్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదని, ఉదయం 9 గంటల ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నాయని ఢిపెన్స్ అధికారులు తెలిపారు. కాగా, […]

పాక్ వక్ర బుద్ది.. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు

Edited By:

Updated on: Jul 20, 2019 | 9:34 PM

పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. సరిహద్దుల్లో మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. మోర్టార్లు, తేలికపాటి ఆయుధాలతో పాక్ బలగాలు శనివారం నాడు కాల్పులకు తెగబడ్డాయి. అయితే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. పాక్ దాడులను సమర్ధవంతంగా తిప్పికొట్టింది. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా మెంథార్ సెక్టార్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

అయితే ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదని, ఉదయం 9 గంటల ప్రాంతంలో కాల్పులు చోటుచేసుకున్నాయని ఢిపెన్స్ అధికారులు తెలిపారు. కాగా, కాల్పులతో సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళనకు గురయ్యారని, వారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా సూచించామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.