భారత గిరిజన మహిళా ! నీ కళ ఇటలీలో !

కళలకు ఎల్లలు, హద్దులు ఉండవన్న మాట నిజం.. భారత కళాత్మకత విదేశాల్లోనూ హైలైట్ అవుతోందంటే అందుకు జస్ట్.. 80 ఏళ్ళ వృధ్ధ మహిళ కూడా కారణమంటే ఆశ్చర్యం కలగక మానదు. అదే విచిత్రం ! ఇందుకు ఉదాహరణగా మధ్యప్రదేశ్ లోని ఉమేరియా జిల్లాకు చెందిన ఓ గిరిజన మహిళ.. ఎనిమిది పదుల వయసున్న జోధైయా బాయి బైగా ని చెప్పుకోవచ్చు. ఆమె చేతుల్లో అద్భుతమైన కళ ఉట్టిపడుతోంది. తన జీవితంలో సగం చక్కని పెయింటింగుల చిత్రీకరణలోనే గడిపేస్తూ […]

భారత గిరిజన మహిళా ! నీ కళ ఇటలీలో !

Updated on: Oct 08, 2019 | 4:12 PM

కళలకు ఎల్లలు, హద్దులు ఉండవన్న మాట నిజం.. భారత కళాత్మకత విదేశాల్లోనూ హైలైట్ అవుతోందంటే అందుకు జస్ట్.. 80 ఏళ్ళ వృధ్ధ మహిళ కూడా కారణమంటే ఆశ్చర్యం కలగక మానదు. అదే విచిత్రం ! ఇందుకు ఉదాహరణగా మధ్యప్రదేశ్ లోని ఉమేరియా జిల్లాకు చెందిన ఓ గిరిజన మహిళ.. ఎనిమిది పదుల వయసున్న జోధైయా బాయి బైగా ని చెప్పుకోవచ్చు. ఆమె చేతుల్లో అద్భుతమైన కళ ఉట్టిపడుతోంది. తన జీవితంలో సగం చక్కని పెయింటింగుల చిత్రీకరణలోనే గడిపేస్తూ వస్తోంది. తన భర్త మరణించాక.. నాలుగు దశాబ్దాలుగా తన ముసలి వయస్సులోనూ వణకుతున్న చేతులతోనే చిత్రాలు వేస్తోంది. లోర్హా గ్రామవాసి అయిన బైగా.. ఒక పరాయి దేశంలో తన చిత్రకళను గుర్తించడం తనకెంతో సంతోషంగా ఉందని అంటోంది. అయితే ఆ పరాయి దేశమేధో చెప్పలేకపోయింది. ‘ నాచుట్టూ ఉన్న పరిసరాలు, లేదా జంతువులు, లేక ప్రకృతి నన్నీ చిత్రకళకు ప్రేరేపిస్తోంది.. వాటి రూపాలను గుర్తుంచుకుని బొమ్మలు గీస్తుంటాను ‘ అని ఆమె చెప్పింది. పెయింటింగులు వేయడంలో కొంతకాలం ఆమెకు శిక్షణ ఇఛ్చిన ఆశిష్ స్వామి.. తన ‘ శిష్యురాలు ‘ ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది.. ‘ అంటున్నారు. తన జీవితంలో ఈమె ఎన్నో విషాదకర అనుభవాలను ఎదుర్కొందని ఆయన తెలిపారు. ఇటలీలో బైగా చిత్రకళ ప్రదర్శితం కావడం అద్భుతం అన్నారు. ‘ ఆదివాసీలకు ఇది గర్వకారణం.. కానీ వారికి విద్యాసౌకర్యాలు లేవు. అదే విచారకరం. ఎవరో ఒకరు ముందుకు వచ్చి .. ఇలాంటివారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ‘ అని ఆశిష్ స్వామి పేర్కొన్నారు.బైగా వేసిన పెయింటింగులు ఇటలీ లోని మిలన్ లో జరుగుతున్న ఓ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు నోచుకుంది. మరి-దేశ సరిహద్దులను దాటి ఈ వృధ్ధురాలి చిత్ర కళాఖండాలను అక్కడి వరకు చేర్చిన అజ్ఞాత వ్యక్తి ఎవరో తెలియలేదు. బహుశా ఆశిష్ స్వామి కావచ్ఛేమో !

Loading...
Unable to load recommendations.
Follow Us