ఆవు పేడతో తయారు చేసిన పెయింట్ గురించి మీకు తెలుసా.? ఈ పెయింట్‌తో కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు.

|

Dec 18, 2020 | 7:37 PM

తాజాగా ఆవు పేడతో ఏకంగా పెయింట్‌నే తయారు చేశారు. త్వరలోనే ఈ పెయింట్ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. వేదిక్ పేరుతో రూపొందించిన ఈ పెయింట్‌లో ఎన్నో సుగుణాలున్నాయని గడ్కారీ ట్వీట్ చేశారు.

ఆవు పేడతో తయారు చేసిన పెయింట్ గురించి మీకు తెలుసా.? ఈ పెయింట్‌తో కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు.
Follow us on

paint made with cow dung: ఆవు పేడలో ఎన్నో మంచి గుణాలున్నాయని మనందరికీ తెలిసిందే. అందుకే ఒకప్పుడు ఇంటి వాకిలిని ఆవు పేడతో అలికేవారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇది కొనసాగుతున్నా చాలా ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లతో వాకిలి అలకడం అనే ఊసే లేకుండా పోతోంది. అయితే ఇప్పుడు ఆవు పేడ గురించి ఎందుకనేగా మీ సందేహం. తాజాగా ఆవు పేడతో ఏకంగా పెయింట్‌నే తయారు చేశారు. త్వరలోనే ఈ పెయింట్ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

వేదిక్ పేరుతో రూపొందించిన ఈ పెయింట్‌లో ఎన్నో సుగుణాలున్నాయని గడ్కారీ ట్వీట్ చేశారు. ఈ పెయింట్ ద్వారా ప్రజల ఆరోగ్యాలు మెరుగుపడడమే కాకుండా రైతుల ఆదాయాలు కూడా పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఖాధీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ ద్వారా ఈ పెయింట్ తయారవుతోందని, వీటి ద్వారా పాడి రైతులు అదనంగా ఏడాదికి రూ.55 వేలు సంపాదిస్తారని గడ్కరి పేర్కొన్నారు. ఇక ఈ పెయింట్‌ విశేషాల గురించి చెప్పుకుంటే.. ఇది డిస్టెంబర్, ఎమల్షన్ రూపాల్లో అందుబాటులో ఉంటుంది, పెయింట్ వేసిన అనంతరం నాలుగు గంటల్లోనే ఆరిపోతుంది. పర్యావరణ హితమైన ఈ పెయింట్ విషరహిత, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉంటుంది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఈ పేడ పెయింట్‌‌ను కుమారప్ప నేషనల్ హ్యాండ్‌మేడ్ పేపర్ ఇన్‌స్టిట్యూట్ గత కొన్నేళ్లుగా రూపొందింస్తున్నారు.