Oxford 2020 Hindi Word : ఆక్స్​ఫర్డ్ డిక్షనరీలో చోటు దక్కించుకున్న ప్రధాని మోదీ చెప్పిన పదం..

|

Feb 03, 2021 | 5:18 PM

ఆక్స్​ఫర్డ్ హిందీ వర్డ్​ ఆఫ్ 2020గా 'ఆత్మనిర్భరత' పదం నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతేడాది విశేషంగా ఉపయోగించిన  'అత్మనిర్భరత' పదం ఆక్స్​ఫర్డ్ డిక్షనరీలో చోటు దక్కించుకుంది.

Oxford 2020 Hindi Word : ఆక్స్​ఫర్డ్ డిక్షనరీలో చోటు దక్కించుకున్న ప్రధాని మోదీ చెప్పిన పదం..
Aatmanirbharta
Follow us on

Oxford 2020 Hindi Word : ఆక్స్​ఫర్డ్ హిందీ వర్డ్​ ఆఫ్ 2020గా ‘ఆత్మనిర్భరత’ పదం నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతేడాది విశేషంగా ఉపయోగించిన  ‘అత్మనిర్భరత’ పదం ఆక్స్​ఫర్డ్ డిక్షనరీలో చోటు దక్కించుకుంది. దేశవ్యాప్తంగా మారుమోగిన ఈ పదం.. హిందీ వర్డ్ ఆఫ్ ఇయర్-2020గా నిలిచింది.

గతేడాది ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించిన సమయంలో ప్రధాని మోదీ ఈ పదం ఉపయోగించారు. కోవిడ్ వైరస్‌పై కోట్లాదిమంది భారతీయుల విజయానికి ఈ పదం ప్రామాణికంగా నిలిచినట్లు ఆక్స్​ఫర్డ్ తెలిపింది. కోవిడ్ వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తూ ఆత్మనిర్భర్​ భారత్​ ఆవశ్యకతను వెల్లడించారు. అప్పటి నుంచి ఈ పదం వాడకం విపరీతంగా పెరిగింది.

స్వావలంబనను సూచించే ‘అత్మనిర్భరత’ పదం ఆక్స్​ఫర్డ్​ హిందీ వర్డ్​ ఆఫ్ 2020గా నిలిచింది. కోట్లాది భారతీయులు కరోనా మహమ్మారిపై విజయం సాధించేందుకు ఈ పదం ప్రమాణికంగా నిలిచినట్లు ఆక్స్​ఫర్డ్​ పేర్కొంది. గతేడాది అధికంగా ఈ పదాన్నే ఉపయోగించినట్లు తెలిపింది. అందుకే తమ భాషా నిపుణుల సలహా కమిటీలోని సభ్యులు కృతిక అగర్వాల్​, పూనమ్​ నిగం సహాయ్​, ఇమోగెన్​ ఫోక్సెల్​ ఈ పదాన్ని ఎంపిక చేసినట్లు ప్రకటించింది.

గతేడాది కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తూ ఆత్శనిర్భర్ భారత్​ ఆవశ్యకతను తెలియజేశారు. మహమ్మారిని జయించేందుకు ఒక దేశంగా, ఆర్థిక వ్యవస్థగా, సమాజంగా, వ్యక్తులుగా స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఆత్మనిర్భర్​ భారత్’​ నినాదంతోనే స్వదేశంలోనే రెండు కరోనా వ్యాక్సిన్లను విజయవంతంగా అభివృద్ధి చేశారు.

ఇవి కూడా చదవండి : 

Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్​జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్..
Naadu Nedu Second Phase : మనబడి ‘నాడు- నేడు’పై సీఎం జగన్‌ సమీక్ష.. రెండో విడతకు సిద్ధం కావాలని అధికారులకు ఆదేశాలు..