క్షణ క్షణం భయం..భయం., కాటికాపరుల గోడు, వ్యాక్సినేషన్ లో తమకూ ప్రాధాన్యమివ్వాలని డిమాండ్ , ఆదుకుంటున్న స్వచ్చంద సంస్థలు

దేశంలో కోవిడ్ కేసులు పెరిగిపోతుండగా రోజూ వందల సంఖ్యలో కోవిడ్ రోగుల డెడ్ బాడీలు శ్మశాన వాటికలకు చేరుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేవరకూ చితులు కాలుతూనే ఉంటాయి.

క్షణ క్షణం భయం..భయం., కాటికాపరుల గోడు, వ్యాక్సినేషన్ లో తమకూ ప్రాధాన్యమివ్వాలని డిమాండ్ , ఆదుకుంటున్న స్వచ్చంద సంస్థలు
Crematorium Workers

Edited By: Janardhan Veluru

Updated on: May 11, 2021 | 11:13 AM

దేశంలో కోవిడ్ కేసులు పెరిగిపోతుండగా రోజూ వందల సంఖ్యలో కోవిడ్ రోగుల డెడ్ బాడీలు శ్మశాన వాటికలకు చేరుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేవరకూ చితులు కాలుతూనే ఉంటాయి. ఖననాలు జరుగుతూనే ఉంటాయి. ఒక వర్గం వారి మృతదేహాలను దహనం చేయాల్సి వస్తే మరో వర్గం వారి డెడ్ బాడీలను ఖననం చేయాల్సి వస్తోంది. ఇక్కడ పని చేస్తున్న వర్కర్లు (కాటి కాపరులు అనవచ్చా) ఇటీవల తమ గోడును మీడియా వద్ద వెళ్లబోసుకున్నారు. మృత దేహాల కారణంగా తాము కోవిడ్ హైరిస్క్ ను ఎదుర్కొంటున్నామని, తమకు నాణ్యత కల్గిన మాస్కులు గానీ , చేతులకు గ్లోవ్స్ గానీ లేవని వారు వాపోయారు. కనీసం శానిటైజేషన్ సౌకర్యం అంతకన్నా లేదన్నారు.ఘాజీపూర్ దహనవాటిక వద్ద, ఢిల్లీ గేట్ ఖబరిస్థాన్ వద్ద పని చేసే వర్కర్లు తమ దీన స్థితిని వివరించారు. తామంతా చాలా పేదలమని, ఒకప్పుడు రోజుకు 10 నుంచి 15 డెడ్ బాడీలు ఈ శ్మశాన వాటికలకు వస్తే ఇప్పడు రోజుకు 100 నుంచి 115 మృతదేహాలు వస్తున్నాయని వారు చెప్పారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఇతర కేటగిరీలకు ప్రాధాన్యమిస్తున్నట్టే తమకు కూడా ప్రయారిటీ ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. కనీసం నిరసన తెలపడానికి వెళదామన్నా ఇక్కడ రోజంతా తాము బిజీగా ఉంటామని, వెళ్లే తీరిక ఎక్కడిదని వారు అన్నారు. మాకూ కుటుంబాలు ఉన్నాయి.. పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు.. వారి పోషణ కోసం మేము ఇలా కష్టపడక తప్పడంలేదు అని వారు చెప్పారు.

తాము తెల్లవారుజామున 4 గంటలకు వస్తే రాత్రి ఇల్లు చేరేసరికి 10 గంటలు దాటిపోతుందని వారు తెలిపారు. మమ్మల్ని పట్టించుకునేవారేరీ అని వాపోయారు. అయితే ఢిల్లీలోని ఓ స్వచ్చంద సంస్థ వీరి కష్టాలను గుర్తించి వీరికి ఆహారం, మాస్కులు, గ్లోవ్స్ అందజేస్తోంది. ఈ సంస్థకు తాము ఎంతైనా రుణపడి ఉంటామని ఈ వర్కర్లు ఆనందంతో చెబుతున్నారు

 

మరిన్ని ఇక్కడ చూడండి: Oxygen Saving: ఆక్సిజన్ సిస్టర్స్‌ చొరవతో ప్రాణ‌వాయువు ఆదా.. ప‌క్కా ప్ర‌ణాళిక‌తో సేవింగ్.. ఎక్క‌డంటే

Chennai Railway Police: చెన్నై రైల్వేస్టేషన్ లో పోలీసుల ఎంజాయ్ ఎంజామీ.. ఎందుకో తెలుసా.. Viral Video