కర్ణాటకలో కోవిడ్ విశ్వరూపం చూపుతోంది. ఒక్కరోజులో 31 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 180 మంది రోగులు మృతి చెందారు. ఇక బెంగుళూరు నగరంలో ఒక్కరోజులో 17,550 కేసులు నమోదు కాగా 97 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు మూడు లక్షలు దాటిపోగా ఒక్క బెంగుళూరులోనే 2.06 లక్షల కేసులు నమోదైనట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్రం లో రెండు వారాల లాక్ డౌన్ ని ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటలవరకు మాత్రమే నిత్యావసర సర్వీసులను అనుమతిస్తున్నారు. ఢిల్లీలో మాదిరే కర్ణాటకలోనూ ఆక్సిజన్ఎం హాస్పిటల్స్ లో బెడ్స్ కొరత ఎక్కువగా ఉంది. రోగులు, వారి బంధువుల దీనస్థితిపై సోషల్ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక దేశ వ్యాప్తంగా ఆక్సిజన్, మందుల కొరతను పడకల కొరతను ఆసుపత్రులు ఎదుర్కొంటున్నాయి. ఢిల్లీ హాస్పిటల్స్ లో పరిస్థితి ఇప్పటికీ దారుణంగా ఉంది. ఆక్సిజన్ లభ్యతపై ఢిల్లీ ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య వివాదం తలెత్తింది నగరంలోని స్మశాన వాటికలు డెడ్ బాడీలతో నిండిపోతున్నాయి. కొత్తవాటిని ఏర్పాటు చేస్తున్నారు . ఓ శ్మశాన వాటికకు రోజుకు 60 నుంచి 70 మృత దేహాలు వస్తున్నాయి.
అయితే విదేశాలనుంచి అందుతున్న సాయం వల్ల పరిస్ట్గితి కొంతవరకు అదుపులోకి రాగలదని భావిస్తున్నారు. కానీ ఈ సాయం అందడంలో జాప్యం జరుగుతోంది. అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి దేశాలు ఆక్సిజన్, ఇతర వైద్య పరికరాలు,మందులను పంపడానికి సన్నాహాలు చేస్తున్నాయి .