prakash javadekar: ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లకు సంబంధించి మార్గదర్శకాలను, విధివిధానాలను త్వరలోనే విడుదల చేస్తామని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. ఓటీటీల విషయంలో ఫిర్యాదులతోపాటు సలహాలు, సూచనలు కూడా వచ్చాయని వాటిని పరిగణలోకి తీసుకున్నామని జవదేకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన రాజ్యసభలో మంగళవారం మాట్లాడారు. సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఓటీటీల విషయంలో మార్గదర్శకాలు సిద్ధమయ్యాయన్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై సున్నితమైన సమాచార ప్రసారం చేయకుండా నియంత్రించడానికి త్వరలోనే విధివిధానాలను అమల్లోకి తీసుకువస్తామని ఆయన స్పష్టంచేశారు.
అదేవిధంగా టీఆర్పీకి సంబంధించి కూడా కొత్త గైడ్ లైన్స్‌ను కూడా తీసుకురానున్నట్లు జవదేకర్ పేర్కొన్నారు. ఇది చాలా ముఖ్యమైన అంశమని.. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్నామని తెలిపారు. అంతకుముందు బీజేపీ సభ్యుడు మహేశ్ పొద్దార్ మాట్లాడుతూ.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై ప్రసారం అవుతున్న కంటెంట్, భాష.. వివక్షాపూరితంగా.. అసభ్యకరంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
Also Read: