Organ Donation: తాను మరణిస్తూ.. మరో ఐదుగురుకి మళ్ళీ జీవితాన్ని ఇచ్చిన యువతి.. వారిలో ఇద్దరు ఆర్మీ జవాన్లు

|

Jul 16, 2022 | 5:30 PM

మహారాష్ట్రలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ యువతి అవయవదానం చేయడం వల్ల మరో ఐదుగురికి పునర్జన్మ లభించింది. ఇందులో ఇద్దరు ఆర్మీ సైనికులు కూడా ఉండడం విశేషం.

Organ Donation: తాను మరణిస్తూ.. మరో ఐదుగురుకి మళ్ళీ జీవితాన్ని ఇచ్చిన యువతి.. వారిలో ఇద్దరు ఆర్మీ జవాన్లు
Pune Woman Organ Donation
Follow us on

Organ Donation: ప్రకృతిలో జనన మరణాలు అనివార్యం.. పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు.. అయితే మనిషి తాను మరణిస్తూ.. అవయవదానం చేసి మరికొందరి జీవితంలో వెలుగులు నింపవచ్చు. మనిషి అవయవాలను దానం చేయడం వల్ల మరికొంత మందికి పునర్జన్మ ప్రసాదించవచ్చు. గత కొంతకాలంగా అవయవదానం మీద ప్రజల్లో అవగాహనా పెరుగుతోంది. దీంతో ప్రాణకి ప్రాణమైన కుటుంబ సభ్యులు మరణం అంచున ఉంటే .. అవయవాలను దానం చేసి.. మరొకొందరి జీవితాల్లో వెలుగులు నింపడానికి ముందుకొస్తున్నారు. మహారాష్ట్రలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ యువతి అవయవదానం చేయడం వల్ల మరో ఐదుగురికి పునర్జన్మ లభించింది. ఇందులో ఇద్దరు ఆర్మీ సైనికులు కూడా ఉండడం విశేషం. వివరాల్లోకి వెళ్తే..

పూణేకు చెందిన ఓ యువతి ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. గాయపడిన యువతని చికిత్స నిమిత్తం పూణేలోని కమాండ్ హాస్పిటల్ సదరన్ కమాండ్ కు తరలించారు. అయితే అప్పటికే ఆ యువతి బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది.. కుటుంబ సభ్యులను సంప్రదించారు. యువతి అవయవాలను దానం చేసేలా ఒప్పించారు.

కుటుంబ సభ్యుల అంగీకారంతో కమాండ్ హాస్పిటల్ (సదరన్ కమాండ్)లోని ట్రాన్స్‌ప్లాంట్ టీమ్ వెంటనే యాక్టివ్ అయ్యారు. జోనల్ ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేషన్ సెంటర్ (ZTCC) , ఆర్మీ ఆర్గాన్ రిట్రీవల్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ అథారిటీ (AORTA)ల్లో ఆర్గాన్స్ కావాల్సిన బాధితులను గుర్తించేలా చర్యలు తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

దీంతో జూలై, 14 రాత్రి మరియు జూలై 15 తెల్లవారుజామున  కిడ్నీలు అవసరమున్న ఇద్దరు ఇండియన్ ఆర్మీ సైనికులుకు మార్పిడి చేశారు. పూణేలోని రూబీ హాల్ క్లినిక్‌లో ఒక రోగికి కాలేయం ట్రాన్స్ ప్లాంట్ చేశారు. సాయుధ దళాల వైద్య కళాశాలోని ఐ బ్యాంక్ వద్ద కళ్ళు భద్రపరిచారు. కంటి చూపు అవసరమైన మరో ఇద్దరికీ ఆమె కళ్ళను అమర్చారు. దీంతో ఆ యువతి తాను మరణిస్తూ.. మరో ఐదుగురు వ్యక్తులకు జీవితాన్ని ఇచ్చింది. ఆ కుటుంబాల్లో వెలుగులు నింపింది.

“మీ అవయవాలను స్వర్గానికి తీసుకెళ్లకండి, అవి మనకు ఇక్కడ అవసరమని దేవునికి తెలుసు అంటూ డిఫెన్స్ వైద్య సిబ్బంది వ్యాఖ్యానించారు. తాము నిరుపేద రోగులకు అవయవ దానం గురించి.. అవగాహన కల్పిస్తున్నామని డిఫెన్స్ తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..