Marriage: రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా.. అధికారుల పర్మిషన్ తీసుకోవాల్సిందే.. లేకుంటే
ప్రభుత్వ ఉద్యోగులకు బిహార్ (Bihar) ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వివిధ కారణాలతో రెండో పెళ్లి చేసుకోవాలనుకునే ఎంప్లాయిస్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విభాగాల్లో పని చేసే ఉద్యోగులు ఎవరైనా సరే రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటే...
ప్రభుత్వ ఉద్యోగులకు బిహార్ (Bihar) ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వివిధ కారణాలతో రెండో పెళ్లి చేసుకోవాలనుకునే ఎంప్లాయిస్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విభాగాల్లో పని చేసే ఉద్యోగులు ఎవరైనా సరే రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటే సంబంధిత ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. భార్య లేదా భర్త బతికి ఉండగానే రెండో పెళ్లి చేసుకోవడం వంటి ఘటనలు ఎక్కువవడం, ఆపై ఉద్యోగం, పెన్షన్, సంబంధిత వివాదాలు, న్యాయపరమైన చిక్కులు తలెత్తుతుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సంబంధిత విభాగానికి చెందిన పై అధికారుల నుంచి పర్మిషన్ తీసుకున్నాకే గవర్నమెంట్ ఎంప్లాయిస్ (Government Employees) రెండో పెళ్లి చేసుకోవాలి. అంతే కాకుండా వైవాహిక పరిస్థితి గురించి సవివరంగా వివరించాలి. భార్య లేక భర్త చనిపోయిన విషయం, లేదా విడాకుల విషయాన్ని కారణంగా చూపి రెండో పెళ్లి చేసుకోవచ్చు.
ఒకవేళ మొదటి భార్య గానీ, భర్త గానీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తే రెండో భార్య, భర్తకు ఎలాంటి ప్రభుత్వ సదుపాయాలు అందవని స్పష్టం చేసింది. పై అధికారులకు తెలియజేయకుండా రెండో పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు, ఇతర సదుపాయాలు అందవని హెచ్చరించింది. ఈ నిబంధనలు పురుషులతో పాటు మహిళలకూ వర్తిస్తుంది. అనుమతి లేకుండా రెండో వివాహం చేసుకున్న వాళ్లు సర్వీసులో ఉండగా హఠాన్మరణం చెందితే వాళ్ల భర్త లేదా భార్యకు గానీ, వాళ్ల సంతానానికి గానీ కారుణ్య నియామకం వర్తించదు. అంటే…కారుణ్య నియామకం కింద వారికి ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించదు. ఇలాంటి సమయంలో మొదటి భార్య లేదా భర్త సంతానానికే ప్రాధాన్యతనిస్తారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి