Farmers protest: ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. సాగు చట్టాలపై పోరులో ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వ్యవసాయ రంగంలో సంస్కరణ పేరుతో కేంద్రం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం చేస్తోన్న నిరసనలు మరో మైలురాయిని చేరనున్నాయి. ఈ క్రమంలో రైతు సంఘాల ఉమ్మడి వేదిక సంయుక్త కిసాన్ మోర్చా కీలక పిలుపునిచ్చింది. ఇక సాగుచట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమానికి ఈనెల 26 నాటికి ఆరు నెలలు నిండనున్నాయి. అదే విధంగా ప్రధాని నరేంద్రమోదీ పాలనకు ఏడేళ్లు పూర్తి కానుంది. ఈ సందర్భాన్ని ‘బ్లాక్ డే’గా గుర్తిస్తూ రైతు సంఘాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. మే 26న గ్రామాలు మొదలుకొని ఢిల్లీ దాకా అన్ని చోట్లా నల్ల జెండాలతో నిరసనలు తెలపాలని కిసాన్ మోర్ఛా పిలుపునకు దేశంలోని 12 ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడిగా సంపూర్ణ మద్దతు పలికాయి.
రైతులు తలపెట్టిన ‘మే 26 బ్లాక్ డే’ కార్యక్రమానికి మద్దతు పలుకుతున్నామని, కొవిడ్ నిబంధనల మేరకు నిరసన కార్యక్రమాల్లో తామూ పాల్గొంటామని 12 ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడిగా ప్రకటన చేశాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని, పంటలకు కనీస మద్దతు ధరను చట్టబద్దం చేయాలని డిమాండ్ చేస్తూ రాసిన లేఖపై ఆయా పార్టీల నేతలు సంతకాలు చేశారు.
అయితే రైతు నిరసనలకు మద్దతు తెలుపుతూ ప్రతిపక్షాలు ఉమ్మడిగా విడుదల చేసిన లేఖపై కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, జేడీఎస్ అధినేత దేవేగౌడ, వెస్ట్ బెంగాల్ సీఎం, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, జేఎఎం చీఫ్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఎన్సీ నేత ఫారూఖ్ అబ్దుల్లా, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సీపీఐ నేత డి. రాజా, సీపీఎం నేత సీతారాం ఏచూరిలు సంతకాలు చేశారు.
America: అమెరికాలో అర్ధరాత్రి దాటిన తర్వాత కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు