
పాకిస్తాన్- భారత్ మధ్య వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాక్‌పై యుద్దానికి దిగింది. అయితే ప్రస్తుతం రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఉండగా, ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించి భారత రక్షణ అధికారుల మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
ఉగ్రవాదులకు పాక్ మిలిటరీ మద్దతుగా ఉండటం సిగ్గుచేటు అని, పాక్ సైన్యానికి జరిగిన నష్టానికి బాధ్యతవహిస్తున్నామన్నారు. పాక్ ప్రజలకు ఎలాంటి నష్టం తలపెట్టలేదని ఎయిర్ మార్షల్ ఏకే భారతి అన్నారు. భారత్‌పై పాక్ దాడులను నిలువరించామని, పాక్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశామన్నారు. చైనా తయారీ ఆయుధాలను పడగొట్టామన్నారు. నూర్‌ఖాన్, రహీంయార్‌ఖాన్ ఎయిర్ బేస్‌లపై దాడిచేశామని, రక్షణ వ్యవస్థలతో శత్రువుల ఆయుధాలు చిత్తుచేశామన్నారు. చైనా క్షిపణి PL-15 ను కూల్చివేసినట్లు ఎయిర్ మార్షల్ ఏకే భారతి అన్నారు. అదే సమయంలో పాకిస్తాన్ డ్రోన్లను లేజర్ గన్స్ తో కూల్చివేసారు.
BSF జవాన్లు వారి బాధ్యతను నిర్వహించారని, అమాయక ప్రజలపై పాక్ దాడులకు తెగబడిందని రాజీవ్‌ఘాయ్ అన్నారు. పహల్గామ్‌లో అమాయక పర్యాటకులను చంపారని, మేం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ముందే సిద్ధం చేశామన్నారు. మన ఎయిర్ డిఫెన్స్ బలమైనగోడలా నిలిచిందని, రాజీవ్ ఘాయ్ పేర్కొన్నారు. పాక్‌పై అత్యాధునిక ఆయుధాలతో విరుచుకుపడ్డామని, బహుళ రక్షణ వ్యవస్థను అధిగమించే శక్తి పాక్‌కు లేదని అన్నారు. పహల్గామ్ పాపానికి మూల్యం చెల్లించుకోక తప్పలేదన్నారు. భారత సైనిక స్థావరాలపై దాడి చేయడం అసాధ్యమని, త్రివిధ దళాల మధ్య సంపూర్ణ సమన్వయం ఉందన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి