Operation Sindoor: ఉగ్రస్థావరాలపై దాడులు.. దేశంలో పలు విద్యాసంస్థలకు సెలవు..! ఎప్పటి వరకు అంటే..

ఆపరేషన్‌ సింధూర్ పేరుతో భారత్ ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేయడంతో పాక్‌ సైన్యం సరిహద్దుల్లో కాల్పులకు తెగబడింది. దీంతో జమ్మూకాశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్రమత్తమైన అధికారులు పాక్‌ దుశ్చర్యను తిప్పికొట్టేందుకు చర్యలు చేపట్టారు. జమ్మూకాశ్మీర్‌ సహా పలు విద్యా సంస్థలను మూసివేశారు. స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఇచ్చినట్టు అధికారులు ప్రకటించారు.

Operation Sindoor: ఉగ్రస్థావరాలపై దాడులు.. దేశంలో పలు విద్యాసంస్థలకు సెలవు..! ఎప్పటి వరకు అంటే..
Schools Closed

Updated on: May 07, 2025 | 9:53 AM

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి జరిగింది. దీనిలో దాదాపు 26 మంది మరణించారు. ఈ దాడిలో హిందువులను టార్గెట్‌గా చేసుకున్న ఉగ్రమూకలు వారిలో కేవలం మగవారిని మాత్రమే చంపుతూ పోయారు. అప్పటి నుండి ఈ దాడి పట్ల భారతదేశ ప్రజలలో ఆగ్రహం పెల్లుబూకింది. ఈ నేపథ్యంలోనే ‘ఆపరేషన్‌ సింధూర్‌’ పేరుతో పాక్‌లోని 9 ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసింది భారత సైన్యం. ఆపరేషన్‌ సింధూర్‌తో అలర్ట్‌ అయిన పాక్‌ సరిహద్దులో కాల్పుల విరమణకు పాల్పడింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం అలుముకుంది. భారత్‌ ,పాక్‌ పరస్పర కాల్పుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లోని అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

ఆపరేషన్‌ సింధూర్ పేరుతో భారత్ ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేయడంతో పాక్‌ సైన్యం సరిహద్దుల్లో కాల్పులకు తెగబడింది. దీంతో జమ్మూకాశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్రమత్తమైన అధికారులు పాక్‌ దుశ్చర్యను తిప్పికొట్టేందుకు చర్యలు చేపట్టారు. జమ్మూకాశ్మీర్‌లోని విద్యా సంస్థలను మూసివేసింది. స్కూల్స్, కళాశాలలకు సెలవులు ఇచ్చినట్టు అధికారులు ప్రకటించారు.

వైమానిక దాడి తర్వాత అనేక చోట్ల పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కాశ్మీర్ డివిజనల్ కమిషనర్ సమాచారం ఇస్తూ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, బారాముల్లా, కుప్వారా, గురేజ్‌లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు ఈ రోజు మూసివేస్తున్నట్టుగా ప్రకటించారు. జమ్మూ, సాంబా, కథువా, రాజౌరి, పూంచ్ జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలను స్వచ్ఛందంగా మూసివేశారు. దీంతో పాటు, పఠాన్‌కోట్‌లోని అన్ని పాఠశాలలను 72 గంటలపాటు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..