Parliament: ఆపరేషన్‌ సింధూర్‌పై రచ్చ… ఈనెల 28,29 తేదీల్లో ఆపరేషన్‌ సింధూర్‌పై చర్చ

బిహార్‌ ఓటర్ల జాబితా సవరణ , ఆపరేషర్‌ సింధూర్‌ అంశాలపై పార్లమెంట్‌లో వరుసగా మూడో రోజు విపక్షాల ఆందోళన కొనసాగింది. ఈ క్రమంలో ఆపరేషన్‌ సింధూర్‌పై పార్లమెంట్‌లో చర్చకు షెడ్యూల్‌ ఖరారయ్యింది. వచ్చే సోమవారం లోక్‌సభలో , మంగళవారం రాజ్యసభలో ఆపరేషన్‌ సింధూర్‌పై చర్చ...

Parliament: ఆపరేషన్‌ సింధూర్‌పై రచ్చ... ఈనెల 28,29 తేదీల్లో ఆపరేషన్‌ సింధూర్‌పై చర్చ
Parliament

Updated on: Jul 24, 2025 | 6:42 AM

బిహార్‌ ఓటర్ల జాబితా సవరణ , ఆపరేషర్‌ సింధూర్‌ అంశాలపై పార్లమెంట్‌లో వరుసగా మూడో రోజు విపక్షాల ఆందోళన కొనసాగింది. ఈ క్రమంలో ఆపరేషన్‌ సింధూర్‌పై పార్లమెంట్‌లో చర్చకు షెడ్యూల్‌ ఖరారయ్యింది. వచ్చే సోమవారం లోక్‌సభలో , మంగళవారం రాజ్యసభలో ఆపరేషన్‌ సింధూర్‌పై చర్చ జరుగుతుంది. ఉభయ సభల్లో 16 గంటల పాటు చర్చ ఉంటుంది. ఆపరేషన్‌ సింధూర్‌పై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో గత మూడు రోజులుగా ఉభయ సభల్లో ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే వాయిదా పడుతున్నాయి.

మరోవైపు బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై రచ్చ కొనసాగుతోంది. ఓటర్ల జాబితా సవరణ 98 శాతం పూర్తయ్యిందని ఈసీ ప్రకటించింది. అయితే బీజేపీని గెలిపించడమే లక్ష్యంగా ఈసీ పనిచేస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఓటర్ల జాబితాపై పార్లమెంట్‌లో , అటు బిహార్‌ అసెంబ్లీలో విపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ సీట్లలో ఎవరు గెలవాలని ఈసీ ముందే నిర్ణయిస్తోందని , ఇక ఎన్నికలు నిర్వహించడం ఎందుకని ప్రశ్నించారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించే ఆలోచనలో ఉన్నట్టు ప్రకటించారు. ఈవిషయంపై మిత్రపక్షాలతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామన్నారు.

బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్‌ ఆవరణలో ధర్నా చేశాయి. కర్నాటక, మహారాష్ట్రలో ఓటర్ల జాబితా అవకతకలను తాము బయటపెట్టటంతో.. బిహార్‌ ఎన్నికల్లో బీజేపీ కొత్త ఎత్తుగడ పన్నుతోందన్నారు విపక్షనేత రాహుల్‌గాంధీ. భారత్‌లో ఎన్నికలనే దొంగలిస్తున్నారు సంచలన ఆరోపణలు చేశారు రాహుల్‌.

అయితే ఇండి కూటమి తీరుపై తీవ్ర విమర్శలు చేశారు కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌. ఇండియా బ్లాక్ హుల్లాద్ బ్లాక్‌గా మారిందన్నారు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్‌. విపక్షం పార్లమెంట్ వెలుపల చర్చ జరగాలని కోరుకుంటోందన్నారు. కీలక అంశాలపై చర్చకు రాకుండా విపక్షనేతలు పారిపోతున్నారన్నారు కేంద్రమంత్రి. మరోవైపు బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణ తుదిదశకు చేరినట్టు ఈసీ ప్రకటించింది. ఇప్పటివరకు 98 శాతం ఓటర్ల జాబిత సవరణ పూర్తయినట్టు తెలిపింది