Encounter: ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మరోసారి తుపాకుల మోత మోగింది. పోలీసులు, మవోయిస్టుల పరస్పర కాల్పులతో దండకారణ్యం దద్దరిల్లిపోయింది. తాజాగా చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నాయకుడు మృతి చెందాడు. పోలీసులు మావోల మధ్య జరిగిన కాల్పుల్లో ఫర్సేఘాట్ యాక్షన్ టీమ్ కమాండర్ సయాబో చనిపోయాడు. మావోయిస్టు సయాబోపై రూ. 8 లక్షల రివార్డ్ ఉంది. కాగా, సంఘటన స్థలంలో ఒక పిస్టల్, రౌండ్స్, బాణాలు, బాంబులు, నిత్యావసర సరుకులు లభ్యమయ్యాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు మృతదేహాన్ని పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ANI Tweet:
A Naxal having a bounty of Rs 8 lakhs was killed in an encounter between Naxals and security forces today at around 4:30 pm in the forest region between Kutru and Ketulnar areas in Chhattisgarh’s Bijapur district: Kamlochan Kashyap, Superintendent of Police, Bijapur pic.twitter.com/eINCkxAr7j
— ANI (@ANI) January 16, 2021