పీఎం కేర్స్ ఫండ్ నుంచి లక్ష పోర్టబుల్ కాన్సెంట్రేటర్లు, 500 ఆక్సిజన్ ప్లాంట్లు, ప్రధాని మోదీ వెల్లడి

| Edited By: Phani CH

Apr 28, 2021 | 7:26 PM

దేశంలో కోవిడ్ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ పీఎం కేర్స్ ఫండ్ నుంచి లక్ష పోర్టబుల్ ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను, 500 ఆక్సిజన్ ప్లాంట్లను మంజూరు చేశారు.

పీఎం కేర్స్ ఫండ్ నుంచి లక్ష పోర్టబుల్ కాన్సెంట్రేటర్లు, 500 ఆక్సిజన్ ప్లాంట్లు, ప్రధాని మోదీ వెల్లడి
Central Govt Impose Complete Lock Down From May 2nd
Follow us on

దేశంలో కోవిడ్ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ పీఎం కేర్స్ ఫండ్ నుంచి లక్ష పోర్టబుల్ ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను, 500 ఆక్సిజన్ ప్లాంట్లను మంజూరు చేశారు. కోవిడ్ 19 మేనేజ్ మెంట్ కుగాను లిక్విడ్  మెడికల్ఆ క్సిజన్  సప్లయ్  ని మెరుగుపరచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ  మీటింగ్ లో  ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.  త్వరగా ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను  ప్రొక్యూర్ చేయాలని, అత్యధిక కోవిడ్ కేసులు ఉన్న రాష్ట్రాలకు అందజేయాలని ప్రధాని ఆదేశించారు. పీఎం  కేర్స్ ఫండ్ నుంచి ఇదివరకే 713 ఆక్సిజన్ ప్లాంట్లను మంజూరు చేశారు. మళ్ళీ ఇప్పుడు తిరిగి కొత్తగా 500 ప్లాంట్లను మంజూరు చేసినట్టు ఈ కార్యాలయం వివరించింది. డీఆర్డీఓ, సీఎస్ఐఆర్ దేశీయంగా డెవలప్ చేసిన టెక్నాలజీ ఆధారంగా ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు.

జిల్లా ప్రధాన కార్యాలయాల  ఆసుపత్రుల్లో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ సరఫరాను ఇవి పెంచుతాయని భావిస్తున్నారు. దేశంలో కోవిడ్ పరిస్థితిని  మెరుగు పరచే కృషిలో భాగంగా మోదీ  నిన్న కూడా ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటికే ఇండియాలో  పెరిగిపోతున్న కేసులపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సాయానికి సిద్ధంగా  ఉన్నాయి.అయితే రవాణాలో జాప్యం  జరగడం సహాయక  చర్యలకు విఘాతంగా పరిణమిస్తోంది.  ప్రధాని గురువారం కూడా తాజా పరిస్థితిపై మదింపు చేయవచ్చు. ఢిల్లీ ఆసుపత్రులు  కొన్ని ఇప్పటికీ ఆక్సిజన్ కొరతను తీవ్రంగా ఎదుర్కొంటున్న సంగతి తెల్సిందే. అందువల్లే ఆయన ప్రధానంగా దీనిపై  దృష్టి పెట్టారు. అవసరమైతే పీఎం కేర్స్ ఫండ్ నుంచి మరిన్ని నిధులను విడుదల చేయడానికి కూడా  ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Hero Prabhas Fans: ప్రభాస్‌ సినిమాలకు వ‌ర‌స‌ అడ్డంకులు.. ఫీలవుతున్న ఫ్యాన్స్..

పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? అయితే ఒక లక్షకు ఎంత నష్టపోతున్నారో తెలుసుకోండి..