జులై రెండో వారం నుంచి దేశంలో రోజూ కోటిమందికి వ్యాక్సిన్లు వేస్తామని ఐసీఎంఆర్ చీఫ్ డాక్టర్ బలరాం భార్గవ తెలిపారు. ఈ సంవత్సరాంతానికల్లా 108 కోట్ల మందికి టీకామందులు ఇవ్వాలన్నది లక్ష్యమన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు టీకామందుల ఉత్పత్తిని పెంచేందుకు అహర్నిశలూ కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. మన దేశ జనాభా చాలా ఎక్కువని, ఈ దృష్ట్యా సహనం అవసరమని ఆయన చెప్పారు. భవిష్యత్తులో వ్యాక్సిన్ కొరత ఉండబోదని ఆయన హామీ ఇచ్చారు. అమెరికా కన్నా మన దేశ జనాభా చాలా ఎక్కువని ఈ విషయాన్నీ గుర్తించాలన్నారు. ఏమైనా ఆగస్టు మొదటి వారానికల్లా ప్రతి రోజూ కోటిమందికి వ్యాక్సిన్ ఇవ్వడం దాదాపు ఖాయమని బలరాం భార్గవ పేర్కొన్నారు. ఇద్దరు మంత్రులు, కేంద్రం కూడా సుప్రీంకోర్టుకు ఈ విషయాన్ని తెలియజేసినట్టు ఆయన తెలిపారు. డిసెంబరు నాటికి 200 కోట్ల వ్యాక్సిన్ డోసులు లభ్యమయ్యే సూచన ఉందని గత నెలలో టాప్ అడ్వైజర్ ఒకరు చెప్పారని భార్గవ వెల్లడించారు.
ప్రస్తుతం దేశంలో నెలకు 8.5 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి అవుతోంది. జులై నాటికి రెండు టీకామందుల ఉత్పత్తి చాలావరకు పెరుగుతుందని కేంద్రం కేరళ హైకోర్టుకు వెల్లడించింది. కోవీషీల్డ్, కొవాగ్జిన్ రెండు టీకామందుల లభ్యతకు సమస్య లేదని పేర్కొంది. కాగా ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లు కూడా త్వరలో ఇండియాకు చేరనున్నాయని తెలుస్తోంది. రష్యా నుంచి స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ అప్పుడే ఇండియాలో అడుగు పెట్టిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆ దేశం నుంచి మంగళవారం హైదరాబాద్ కు భారీ స్థాయిన ఈ టీకామందు చేరుకుంది. శంషాబాద్ విమానాశ్రయంలో దీన్ని అధికారులు అందుకున్నారు.
మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ : ఓనర్స్ పనితో షాక్‌తిన్న కుక్కపిల్ల…నవ్వులే నవ్వులే ..వైరల్ అవుతున్న వీడియో : Dog funny video viral.
యూపీలో అనాముషం..డెడ్ బాడీ నదిలో పడేస్తూ వీడియోకు పోజులు ఇచ్చిన యువకులు: vial video.