Nitish Kumar: 4000 సీట్లు గెలుస్తాం.. ప్రధాని మోదీ సభలో బిహార్‌ సీఎం చిత్రవిచ్రితం.. కాళ్లు మొక్కి..

లోక్‌సభ ఎన్నికల్లో 4000 సీట్లు గెలుస్తామని బిహార్‌ సీఎం నితీష్‌ చేసిన వ్యాఖ్యలపై సెటైర్ల వర్షం కురుస్తోంది. బిహార్‌ లోని నవాడా సభలో ప్రధాని మోదీ సాక్షిగా ఆయన ప్రవర్తన బీజేపీ నేతలతో పాటు ఆయన సొంత పార్టీ నేతలకు కూడా షాక్‌కు గురి చేసింది. నిండుసభలో ప్రధాని మోదీ కాళ్లు మొక్కి బిహార్‌ పరువు తీశారని నితీష్‌పై విమర్శలు కురిపించారు తేజస్వి యాదవ్‌. .

Nitish Kumar: 4000 సీట్లు గెలుస్తాం.. ప్రధాని మోదీ సభలో బిహార్‌ సీఎం చిత్రవిచ్రితం.. కాళ్లు మొక్కి..
Nitish Kumar Pm Modi

Updated on: Apr 08, 2024 | 11:40 AM

లోక్‌సభ ఎన్నికల్లో 4000 సీట్లు గెలుస్తామని బిహార్‌ సీఎం నితీష్‌ చేసిన వ్యాఖ్యలపై సెటైర్ల వర్షం కురుస్తోంది. బిహార్‌ లోని నవాడా సభలో ప్రధాని మోదీ సాక్షిగా ఆయన ప్రవర్తన బీజేపీ నేతలతో పాటు ఆయన సొంత పార్టీ నేతలకు కూడా షాక్‌కు గురి చేసింది. నిండుసభలో ప్రధాని మోదీ కాళ్లు మొక్కి బిహార్‌ పరువు తీశారని నితీష్‌పై విమర్శలు కురిపించారు తేజస్వి యాదవ్‌.. బిహార్‌ సీఎం నితీష్‌కుమార్‌కు సడెన్‌గా ఏమయ్యిందో తెలియదు. ప్రధాని మోదీతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనప్పుడు చిత్రవిచ్రితంగా ప్రవర్తించారు. నవాడా సభలో నితీష్‌ ప్రవర్తన జేడీయూ నేతలకే షాక్‌ను కలిగించింది. ఆయన ప్రసంగమంతా తప్పుల తడకగా సాగింది. సభలో 25 నిముషాల పాటు ప్రసంగించారు నితీష్‌.

ఎన్డీఏ కూటమి 4000 సీట్లు గెలుస్తుందన్న నితీష్‌

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 4000 సీట్లు గెలుస్తుందని నితీష్‌ వ్యాఖ్యానించినప్పుడు ప్రధాని మోదీతో సహా అంతా షాక్‌కు గురయ్యారు. అయినప్పటికి తన ప్రసంగాన్ని అదేవిధంగా కొనసాగించారు. పదేళ్ల నుంచి ప్రధాని మోదీ అధికారంలో ఉన్నారు. మరో ఐదేళ్ల పాటు ఆయనే ప్రధానిగా ఉంటారు. రానున్న ఎన్నికల్లో 4000 మంది ఎంపీలు గెలుస్తారన్న నమ్మకం నాకు ఉందంటూ పేర్కొన్నారు. తన ప్రసంగం ముగించిన తరువాత నితీష్‌ మోదీ పక్కనే కూర్చున్నారు. మీరు అంతా మాట్లాడేశారు ప్రసంగం బాగుంది అని మోదీ మెచ్చుకోగానే నితీష్‌ ఆయన కాళ్లకు మొక్కడం సంచలనం రేపింది. నిండు సభలో నితీష్‌ ఇలా చేయడంతో మోదీ కాస్త ఇబ్బంది పడ్డారు. అయితే, 400 సీట్లు అనడానికి బదులు 4వేల సీట్లు అనడం.. రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది.

వీడియో చూడండి..

లోక్‌సభ ఎన్నికల్లో 4000 సీట్లు గెలుస్తామని బిహార్‌ సీఎం నితీష్‌ చేసిన వ్యాఖ్యలపై సెటైర్ల వర్షం కురుస్తోంది. బిహార్‌ లోని నవాడా సభలో ప్రధాని మోదీ సాక్షిగా ఆయన ప్రవర్తన బీజేపీ నేతలతో పాటు ఆయన సొంత పార్టీ నేతలకు కూడా షాక్‌కు గురి చేసింది. నిండుసభలో ప్రధాని మోదీ కాళ్లు మొక్కి బిహార్‌ పరువు తీశారని నితీష్‌పై విమర్శలు కురిపించారు తేజస్వి యాదవ్‌. కాంగ్రెస్ కూడా ఈ వీడియోను షేర్ చేసి నితీష్ పై విమర్శలు గుప్పించింది.

నితీష్‌ బిహార్‌ పరువును తీశారని విమర్శలు

నితీష్‌ తీరుపై విరుచుకుపడ్డ బిహార్‌ అసెంబ్లీలో విపక్ష నేత తేజస్వి యాదవ్‌. నితీష్‌ బిహార్‌ పరువును తీశారని విమర్శించారు. నిండు సభలో మోదీ కాళ్లు మొక్కి తన పరువును తీసుకున్నారని అన్నారు. మోదీ కంటే ముందే సీఎం పదవిని చేపట్టిన విషయాన్ని నితీష్‌ మర్చిపోయారని అన్నారు

నితీష్‌ తీరుతో బీజేపీ నేతలు ఇబ్బంది పడ్డారు. అసలు లోక్‌సభలో 543 సీట్లు మాత్రమే ఉన్నాయని , 4000 సీట్లు ఎలా గెలుస్తామని వాళ్లు తలలు పట్టుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..