హాథ్రస్ ఘటన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి తలవంపులే కాదు తలనొప్పులను తెచ్చిపెడుతోంది.. పోలీసులు ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. అసలు బాధితురాలికి అర్థరాత్రి అంత్యక్రియలు ఎందుకు నిర్వహించాల్సి వచ్చందన్న దానిపై కూడా విపక్షాలు మండిపడుతున్నాయి.. అర్ధరాత్రి ఎందుకు జరపడానికి గల కారణాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సవివరంగా విన్నవించుకుంది.. మరుసటి రోజు శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలను దృష్టిలో పెట్టకునే తాము అలా చేయవలసి వచ్చిందని ప్రభుత్వం సుప్రీంకు తెలిపింది.. 19 ఏళ్ల దళిత అమ్మాయిపై నలుగురు నిందితులు అత్యాచారం చేసి దారుణంగా హింసించారు.. తీవ్ర గాయాలతో ఆమె సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 29న ఉదయం చనిపోయింది.. ఆమె మృతదేహాన్ని స్వగ్రామనికి తరలించిన పోలీసులు .. అదే రోజు రాత్రి రెండున్నర గంటలకు కుటుంబసభ్యులు, బంధువులు ఎవరూ లేకుండానే అంత్యక్రియలు నిర్వహించింది. ఇదే విషయంపై సుప్రీంకోర్టుకు యూపీ ప్రభుత్వం ఓ అఫిడవిట్ సమర్పించింది.. అమ్మాయి చికిత్స తీసుకున్న సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ దగ్గర విపక్షాలు ఆందోళనలు, ధర్నాలు చేశాయి.. ఇలాంటివే మరికొన్ని జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హాథ్రస్ జిల్లా యంత్రాంగాన్ని హెచ్చరించాయి. ఈ ఘటనకు కులం రంగుపులిమి స్వప్రయోజనాలకు వాడుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని నిఘా వర్గాలు తెలపడంతోనే తాము అత్యవరసరంగా అంత్యక్రియలు జరపాల్సి వచ్చిందని సుప్రీంకోర్టుకు యూపీ ప్రభుత్వం నివేదించుకుంది.