ఎంత అమాయకత్వం.. నాలుగేళ్లు అవుతున్నా పాతనోట్లు రద్దైన విషయం తెలీదట..

తమిళనాడులోని ఈరోడ్, నాగపట్నం జిల్లాల్లో రెండు వింత సంఘటనలు చోటు చేసుకున్నాయి. దేశ వ్యాప్తంగా పాత 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం ఇంకా కొంత మందికి..

ఎంత అమాయకత్వం.. నాలుగేళ్లు అవుతున్నా పాతనోట్లు రద్దైన విషయం తెలీదట..
Follow us

| Edited By:

Updated on: Jul 14, 2020 | 6:04 PM

తమిళనాడులోని ఈరోడ్, నాగపట్నం జిల్లాల్లో రెండు వింత సంఘటనలు చోటు చేసుకున్నాయి. దేశ వ్యాప్తంగా పాత 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం ఇంకా కొంత మందికి తెలియక పోవడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. నాగపట్నం జిల్లా సిర్గాళికి చెందిన రాజాదురై, ఉష అనే వృద్ధ దంపతులు.. కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తూంటారు. కూతురి పెళ్లి కోసం దాచిపెట్టిన సొమ్ముని.. ఇటీవల ఇంటి నిర్మాణం కోసం బయటకు తీశారు వృద్ధ దంపతులు. మొత్తం రూ.35 వేలు. అవన్నీ పాత 500, వెయ్యి రూపాయిల నోట్లు. అవి చూసిన కూతురు ఒక్కసారిగా షాక్‌కి గురైంది. ఇక ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి.. ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఇక ఇటువంటి మరో సంఘటనే ఈరోడ్ జిల్లాలోని అంథియుర్‌లో చోటు చేసుకుంది. అంధుడిగా ఉండి అంగవైకల్యం ఉన్న సోము, ఆయన భార్య పళనియమ్మాళ్ సమీప గ్రామంలో నివసిస్తున్నారు. వీరు ఇంట్లో తయారు చేసిన కొవ్వొత్తులను విక్రయించి దాని ద్వారా ఆదాయం పొందుతూంటారు. అలా కష్టపడి వ్యాపారం చేసి సంపాదించిన 24 వేల రూపాయిలను ఇంట్లో దాచుకొని మరిచిపోయారు. వారం రోజుల క్రితం ఇంట్లో బయటపడ్డ డబ్బులు మార్చడానికి వెళ్లిన సోముకి దాచిన డబ్బు అంత రద్దుయిన పాత నోట్లు అని తేలడంతో తీవ్ర ఆవేదన గురయ్యాడు. అయితే ఈ సమాచారం జిల్లా వ్యాప్తంగా వైరల్ అవడంతో కలెక్టర్ కధీరవన్ స్పందించారు. వెంటనే వృద్ధ దంపతులను పిలిపించి తన సొంత డబ్బుల నుండి 25 వేల రూపాయలను వారికి అందజేశారు కలెక్టర్ కధీరవన్.

Read More:

ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. హాల్ టికెట్ పొందిన వారంతా పాస్..

రేపు సీబీఎస్‌ఈ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల..