ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. హాల్ టికెట్ పొందిన వారంతా పాస్..
టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే బంపర్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్‌ని రద్దు చేసింది జగన్ సర్కార్. అంతేకాకుండా ఆంధ్ర ప్రదేశ్‌లోని పదో తరగతి విద్యార్థులందరూ పాస్ అంటూ ...

టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే బంపర్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్‌ని రద్దు చేసింది జగన్ సర్కార్. అంతేకాకుండా ఆంధ్ర ప్రదేశ్‌లోని పదో తరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్. కాగా పదో తరగతి విద్యార్ధులందర్నీ పాస్ చేస్తున్నట్టు గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పుడు తాజాగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్ హాల్ టిక్కెట్ పొందిన ప్రతి ఒక్కరినీ పాస్ చేసేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా శాఖ కమిషనరుకు ఆదేశాలు జారీ చేశారు సీఎం వైఎస్ జగన్. దీంతో టెన్త్ క్లాస్ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా తెలంగాణ రాష్ట్రంలో కూడా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్‌ని పాస్ చేసిన విషయం తెలిసిందే.